• facebook
  • whatsapp
  • telegram

3 కేంద్ర విద్యా సంస్థలకు రూ.1,453 కోట్లిచ్చాం: కేంద్రం 

 

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేస్తున్న ఎన్‌ఐటీ, ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌లకు ఇప్పటివరకు రూ.1,453.51 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్‌ ఆర్‌టీఐ కింద అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది. ఈ 3 విద్యా సంస్థల అంచనా వ్యయం రూ.3,099.29 కోట్లు కాగా అందులో 46.89% మొత్తం ఇచ్చినట్లు వెల్లడించింది.

Posted Date : 17-08-2021