• facebook
  • whatsapp
  • telegram

ఈఏపీసెట్‌కు రెండో రోజు 33,038 మంది హాజరు

* పరీక్ష నిర్వహణ పరిశీలించిన ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ 

కాకినాడ(భానుగుడి సెంటర్‌), న్యూస్‌టుడే: ఏపీ ఈఏపీసెట్‌-2021 ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష రెండో రోజు ఆగస్టు 20న ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొ. కె.హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూలోని ఈఏపీసెట్‌ కార్యాలయాన్ని 20న ఆయన సందర్శించి, ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఉపకులపతి ఎం.రామలింగరాజు, కన్వీనర్‌ వి.రవీంద్రను అడిగి ఏర్పాట్లను తెలుసుకున్నారు.  మొత్తంగా 34,843 మందికి 33,038 మంది పరీక్ష రాశారని తెలిపారు.
 

Posted Date : 20-08-2021