• facebook
  • whatsapp
  • telegram

సార్వత్రిక డిగ్రీ, పీజీ ప్రవేశాల గడువు 27  

కరీంనగర్‌ (గణేశ్‌నగర్‌), న్యూస్‌టుడే: డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2021-22 విద్యా సంవత్సరంలో డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశానికి ఆగ‌స్టు 27తో గడువు ముగుస్తుందని ప్రాంతీయ సమన్వయ కేంద్రం సహాయ సంచాలకులు రాజేందర్‌రెడ్డి తెలిపారు. సైన్స్‌తో కలిపి ఆర్ట్స్, కామర్స్‌తో పాటు ఇతర కోర్సులు అభ్యసించే అవకాశం ఉందన్నారు. స్టాటిస్టిక్స్, జియాలజీ వంటి ప్రత్యేక కోర్సులతో ఉపాధి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

Posted Date : 23-08-2021