• facebook
  • whatsapp
  • telegram

EAMCET: ఇంటర్‌ పాస్‌ మార్కులతో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు

లాసెట్‌, ఐసెట్‌ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు సైతం అర్హత

ఈనాడు, హైదరాబాద్‌: ఈ విద్యా సంవత్సరం (2021-22) వివిధ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్‌ విద్యలో మార్కుల కనీస శాతంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి జీఓ 129 జారీ చేశారు. ఈ ఉత్తర్వు ఆగ‌స్టు 18న జారీచేయగా అయిదు రోజుల తర్వాత బయటకు రావడం గమనార్హం. సాధారణంగా ఇంటర్‌లో ఎస్‌సీ, ఎస్‌టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉంటేనే ఎంసెట్‌, లాసెట్‌ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ, ఐసెట్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి అర్హులు. అయితే కరోనా నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యార్థులకు కనీస మార్కులు 35 ఇచ్చి ఉత్తీర్ణులను చేసిన ప్రభుత్వం, వారిని కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అనుమతిచ్చింది.

Posted Date : 24-08-2021