• facebook
  • whatsapp
  • telegram

Ap Inter: ఏపీలో ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలు రద్దు

గతంలో మాదిరిగానే ప్రవేశాలు జరపాలని హైకోర్టు ఆదేశాలు

 

 

అమరావతి: ఆన్‌లైన్‌ ప్రవేశాలపై ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. సెంట్రల్‌ ఆంధ్రా జూనియర్‌ కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అసోసియేషన్‌ కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డితో పాటు విద్యార్థులు పిటిషన్‌ వేశారు. ఆన్‌లైన్‌ ప్రవేశాలకు నిబంధనలు వెల్లడించలేదని, సరైన విధానాన్ని రూపొందించలేదని పిటిషనర్లు కోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఇంటర్‌ బోర్డు నోటిఫికేషన్‌ను కోట్టేసింది. గతంలో మాదిరిగానే ప్రవేశాలు జరపాలని బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Posted Date : 06-09-2021