• facebook
  • whatsapp
  • telegram

Engineering: ఇంజినీరింగ్‌లో యాజమాన్య కోటా భర్తీకి తుది గడువు 15

జేఈఈ మెయిన్‌ ర్యాంకు ఆధారంగా సగం సీట్లు భర్తీ చేయాలి

నోటిఫికేషన్‌ జారీ చేసిన ఉన్నత విద్యామండలి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరంలో బీటెక్‌, బీఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో యాజమాన్య కోటా(బి కేటగిరీ) కింద 30 శాతం సీట్లను భర్తీ చేసుకోవడానికి అక్టోబరు 15వ తేదీ తుది గడువుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఈ మేరకు సెప్టెంబ‌రు 16న‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆయా కళాశాలల యాజమాన్యాలు కాలపట్టికను ప్రకటిస్తూ ఆంగ్లం, తెలుగు, ఉర్దూలోని మూడు ప్రధాన పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి. అభ్యర్థులు స్వయంగా లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. యాజమాన్యాలు రోజు వారీగా దరఖాస్తుల వివరాలతో రిజిస్టర్‌ను నిర్వహించాలి. 30 శాతం సీట్లలో సగం ఎన్‌ఆర్‌ఐ కోటా కింద, మిగిలిన సగం జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాలి. అప్పటికీ సీట్లు మిగిలితే వాటిని ఎంసెట్‌ ర్యాంకు, ఇంటర్‌ మార్కుల ఆధారంగా భర్తీ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌ లేదా ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేసే 15 శాతం సీట్లకు కన్వీనర్‌ కోటా ఫీజును మాత్రమే వసూలు చేయాలి. ఎన్‌ఆర్‌ఐ లేదా స్పాన్సర్డ్‌ కోటాకు మాత్రం ఏడాదికి 5 వేల అమెరికా డాలర్లు ఫీజుగా తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా అందిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి మెరిట్‌ జాబితాను ఆయా కళాశాలలు వెబ్‌ పోర్టల్‌, నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

ఎన్‌ఐఓఎస్‌లో 115  ఖాళీలు

నచ్చలేదా? నొచ్చుకోకుండా చెప్పండి!  

Posted Date : 17-09-2021