• facebook
  • whatsapp
  • telegram

JEE: జేఈఈలో ప్రతిభ చాటిన గిరిజన గురుకులాలు 

ఈనాడు డిజిటల్, అమరావతి: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు చక్కటి ప్రతిభ చూపారు. జాతీయ స్థాయిలో ఎస్టీ కేటగిరీలో వెయ్యిలోపు 9 మందికి ర్యాంకులు వచ్చాయి. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌(ఎస్‌ఓఈ)కు చెందిన డి.పార్థసారధి 333వ ర్యాంకు సాధించారు. బి.ఉదయ్‌-409, డి.వరలక్ష్మి-596, జి.భానుప్రసాద్‌-662, జె.లిఖిత్‌సాగర్‌-721, ఎస్‌.జీవన్‌ వరప్రసాద్‌-786, ఎన్‌.శేషారెడ్డి-914, జి.అమరేంద్ర-986, వి.మన్మథరావు-991 ర్యాంకులు తెచ్చుకున్నారు. వీరందరికీ ఐఐటీల్లో ప్రవేశాలు దక్కే అవకాశం ఉందని గిరిజన సంక్షేమ గురుకులాల కార్యదర్శి శ్రీకాంత్‌ ప్రభాకర్‌ వెల్లడించారు. ఐఐటీల్లో ప్రవేశం పొందాక వీరికి ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు. మొత్తం 59 మందికి ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు దక్కే అవకాశముందన్నారు.

Posted Date : 19-10-2021