• facebook
  • whatsapp
  • telegram

145 Students: 145 మంది విద్యార్థులు..ఒకే అధ్యాపకుడు..

డి.హీరేహాళ్‌(రాయదుర్గం పట్టణం), న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రారంభమై రెండేళ్లు గడిచింది. ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ గ్రూపుల్లో ప్రస్తుతం ప్రథమ సంవత్సరంలో 81 మంది, ద్వితీయ సంవత్సరంలో 64 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ఎఫ్‌ఏసీ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్‌ రాయదుర్గానికి బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం కేవలం తాత్కాలిక అధ్యాపకుడు ఒకరే రెండు సంవత్సరాల విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. సొంత భవనం లేదు. ఉన్నత పాఠశాల ఆవరణలో ఒక గది జూనియర్‌ కళాశాలకు ఇచ్చినా అందులో కూర్చొనేందుకు కూడా వీలులేదు. పుస్తకాలు నిల్వ చేసే, వెలుతురు లేని గదిలో అధ్యాపకుడు పాఠాలు బోధించాల్సిన దుస్థితి ఏర్పడింది. 

Posted Date : 20-10-2021