• facebook
  • whatsapp
  • telegram

Certificate Courses: ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా పరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం, మిద్దె తోటలు, తేనెటీగలు, పుట్టగొడుగులు, పట్టు పురుగుల పెంపకం, చిరుధాన్యాల ఉత్పత్తులకు విలువ జోడింపు, వానపాముల ద్వారా ఎరువుల తయారీకి సంబంధించి ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆచార్య ఎన్‌.జి.రంగా వర్సిటీ వ్యవసాయ విభాగం డీన్‌ ఎ.ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జులైలో రెండు నెలల కోర్సు ప్రారంభిస్తామని చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రూ.1500 చొప్పున ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేందుకు కంప్యూటర్, ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్, ఐపాడ్‌ సదుపాయం కలిగి ఉండాలన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ www.angrau.ac.inని చూడాలని సూచించారు. కార్యాలయ పని వేళలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల లోపు సార్వత్రిక, దూరవిద్య కేంద్రం సహ ఆచార్యులు కె.ఎస్‌.పూర్ణిమను 80087 88776, 83096 26619, 91105 62727 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రపంచస్థాయి బోధన

‣ రెండు పరీక్షలకూ ఉమ్మడి వ్యూహం!

‣ కేంద్ర కొలువులకు సిద్ధమా?

‣ రక్షణ రంగంలో ఉన్నత ఉద్యోగాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.