హిమాయత్‌నగర్, న్యూస్‌టుడే: హిమాయత్‌నగర్‌లోని బాబూజగ్జీవన్‌రామ్ (బీజేఆర్) డిగ్రీ కళాశాల యూజీసీ అనుబంధ సంస్థ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు దక్కించుకుంది. ఇటీవల కళాశాల సందర్శించిన న్యాక్ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా 2.19 మార్కులతో బి++ గ్రేడ్ లభించింది. ఇందుకు పత్రాన్ని కళాశాల ప్రిన్సిపల్ పీవీ గీతాలక్ష్మి పట్నాయక్ జూన్ 22న సిబ్బందికి అందజేశారు. గుర్తింపు రావడం వెనుక సిబ్బంది సహకారం, విద్యార్థుల తోడ్పాటే కారణమని ఆమె పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.