ప్రభుత్వానికి ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలు
ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్లో కేటగిరి-బీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీ అధికారం కళాశాలల యాజమాన్యాలకు ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కేటగిరి-బీలో 15శాతం ఎన్ఆర్ఐ కోటా, మరో 15శాతం యాజమాన్య కోటా ఉంటుంది. గతేడాది ఎన్ఆర్ఐ కోటా సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకున్నాయి. వీటిలో మిగిలిన సీట్లతో పాటు 15శాతం యాజమాన్య సీట్లను కన్వీనర్ ద్వారా ఆన్లైన్లో భర్తీ చేశారు. ఆ తర్వాత మిగిలిన సీట్లను స్పాట్ కింద భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కేటగిరి-బీ సీట్లను కన్వీనర్ ద్వారా నింపడంతో కౌన్సెలింగ్ జాప్యమవుతుందని, విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు వెళ్లిపోతున్నారని ఉన్నత విద్యామండలికి ప్రైవేటు యాజమాన్యాల సంఘం విన్నవించింది. డిగ్రీ కళాశాలల్లో యాజమాన్య కోటా అమలును హైకోర్టు రద్దు చేసినందున ఆ తీర్పును తమకు వర్తింప చేయాలని కోరింది. దీంతో ఉన్నత విద్యామండలి.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని ప్రభుత్వం ఆమోదిస్తే ఈ ఏడాది 30శాతం సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకుంటాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.