• facebook
  • whatsapp
  • telegram

Ntr Health Versity Convocation: 15న ఎన్టీఆర్‌ హెల్త్‌’ వర్సిటీ స్నాతకోత్సవాలు

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం 24, 25వ వార్షిక స్నాతకోత్సవాలు జులై 15న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నామని ఉపకులపతి డాక్టర్‌ పిగిలం శ్యాం ప్రసాద్‌ అన్నారు. జులై 13న వర్శిటీ సమావేశ మందిరంలో ఈ వివరాలను విలేకర్లకు వెల్లడించారు. ఈ స్నాతకోత్సవంలో హృద వైద్య పరిశోధనల్లో, వైద్య రంగంలో అత్యుత్తమ సేవలందించిన నిపుణులు తిరుపతి స్విమ్స్‌ మాజీ ఉపకులపతి డాక్టర్‌ జి.సుబ్రహ్మణ్యంకు ఎన్టీఆర్‌ హెల్త్‌’వర్శిటీచే(డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌) గౌరవ డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయనున్నామని వీసీ వెల్లడించారు. 2018 ఏడాదికి నిర్వహిస్తున్న 24వ వార్షిక స్నాతకోత్సవంలో మొత్తం 67 మంది వైద్య విద్యార్థుల్లో 58 బంగారు, 21 రజత పతకాలు, 23 మందికి నగదు పురస్కారాలు అందించనున్నామన్నారు. 2019 ఏడాదికి నిర్వహించే 25వ వార్షిక స్నాతకోత్సవంలో 60 మంది వైద్య విద్యార్థులకు 55 మందికి బంగారు, 18 మందికి రజత పతకాలు, 24 మందికి నగదు బహుమతులు అందించనున్నామన్నారు. ఇంకా పీహెచ్‌డీ(డాక్టరేట్‌) కోర్సు పూర్తి చేసిన ఐదుగురికి, పీజీ డిగ్రీ/డిప్లొమా పూర్తి చేసుకున్న 10 మందికి పట్టాలు అందించనున్నారు. జులై 15న ఉదయం 11.30 గంటలకు నిర్వహించే స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వర్చువల్‌గా అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.శంకర్, జాయింట్‌ రిజిస్ట్రార్‌ అజియ పాల్గొన్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.