• facebook
  • whatsapp
  • telegram

JLM Posts: కొలువులున్నాయి.. కొట్టేవారే కరవయ్యారు!

భారీగా జేఎల్‌ఎం పోస్టులు.. హైదరాబాద్‌లో భర్తీకాని వైనం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. విద్యుత్తు సంస్థలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. మరమ్మతు పనులు చేసేందుకు నైపుణ్యం కల్గిన అభ్యర్థుల కొరత ఉంది. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయాల్సి రావడం, ఇతర ఉపాధి అవకాశాలు పెరగడంతో సిటీలో కరెంట్‌ ఉద్యోగాలపై నైపుణ్యం కల్గిన ఉద్యోగార్థులు అంత ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్‌లో జూనియర్‌ లైన్‌మెన్‌ వంటి పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీకావడం లేదు. క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు ఐటీఐ అర్హతతో డిస్కం జేఎల్‌ఎం నియామకాలు చేపడుతోంది. జిల్లాల్లో పోస్టులన్నీ భర్తీ అవుతుండగా.. నగరంలో మాత్రం పూర్తిగా భర్తీకావడం లేదని అధికారులు అంటున్నారు. మిగిలిన ఖాళీలకు మరిన్ని పోస్టులు కలిపి తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి ఆదివారం జేఎల్‌ఎం రాత పరీక్షను టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ నిర్వహిస్తోంది. 
గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో 575 వరకు జేఎల్‌ఎం ఖాళీలు ఉన్నాయి. సరిపడా సిబ్బంది లేక ముఖ్యంగా విపత్తుల సమయంలో మరమ్మతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఈ పోస్టుల భర్తీకి టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి విద్యుత్తు స్తంభం ఎక్కే పరీక్ష ఉంటుంది. ఇందులో ఎక్కువ మంది విఫలమవుతున్నారని అధికారులు చెబుతున్నారు. డిస్కం వ్యాప్తంగా వెయ్యి పోస్టులకు 56వేల మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 
‣ స్థానికులకే అవకాశం.. జేఎల్‌ఎంల్లో 95 శాతం పోస్టుల్లో ఆయా జిల్లా స్థానికత కల్గిన అభ్యర్థులే అర్హులు. ఇదో సమస్యగా ఉండగా రాష్ట్రంలో ఉన్న నాలుగు డిస్కంలు వేర్వేరు నోటిఫికేషన్లు ఇస్తున్నాయి. ఇది కూడా ప్రతిబంధకంగా మారుతోంది.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రపంచస్థాయి బోధన

‣ రెండు పరీక్షలకూ ఉమ్మడి వ్యూహం!

‣ కేంద్ర కొలువులకు సిద్ధమా?

‣ రక్షణ రంగంలో ఉన్నత ఉద్యోగాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.