• facebook
  • whatsapp
  • telegram

CPGET: సీపీగెట్‌కు తగ్గిన దరఖాస్తులు

గత ఏడాది 78 వేలు...ఈసారి 66 వేలే
ఆగస్టు 2వ వారంలో పరీక్షలు ప్రారంభించే యోచన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాల పరిధిలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌-2022)కు ఈసారి దరఖాస్తులు బాగా తగ్గాయి. గత ఏడాది 78,305 దరఖాస్తులు అందగా...ఈసారి 66 వేలు మాత్రమే వచ్చాయి. అంటే 12 వేలకుపైగా విద్యార్థులు తగ్గిపోయారు. సాధారణంగా ఎంకాం, ఎంఎస్‌సీ గణితం, రసాయనశాస్త్రానికి 25 వేల మంది పోటీపడతారు. ఈసారి ఆ సంఖ్య 17 వేలకు పడిపోయిందని, ఆ మూడు సబ్జెక్టులకే ఎనిమిది వేలు తగ్గాయని కన్వీనర్‌ ఆచార్య పాండురంగారెడ్డి చెప్పారు. బీకాం విద్యార్థులు అధిక శాతం మంది పీజీకి ఎంకాం కోర్సుకు బదులు ఐసెట్‌ ద్వారా ఎంబీఏలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఎంకాం కోర్సులో 10 వేల సీట్లుంటే పోయిన సంవత్సరం 4 వేల మందే అందులో చేరటం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 40 వేలకుపైగా పీజీ సీట్లు అందుబాటులో ఉంటున్నాయి. ఆగస్టు రెండో వారంలో పరీక్షలను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆర్‌1 ఆర్‌సీఎం 3000 నియామకాలు

‣ మూడేళ్లలో 1,000 ఉద్యోగాలు: కగూల్‌

‣ వైద్య, నర్సింగ్‌ విద్యార్థుల బడి బాట

‣ ఆరోగ్య వర్సిటీ కొత్త రిజిస్ట్రార్‌ నియామకానికి నోటిఫికేషన్‌ 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.