• facebook
  • whatsapp
  • telegram

Engineering Seats: ఇంజినీరింగ్‌ బీ కేటగిరి సీట్లకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల స్వీకరణ

ఎన్నారైల స్పాన్సర్డ్‌ ఐచ్ఛికం తొలగింపు

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో యాజమాన్య కోటా(బీ కేటగిరి) సీట్ల భర్తీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీ కేటగిరిలో 30శాతం సీట్లు ఉండగా.. ఇందులో ఎన్నారై కోటా 15శాతం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నారై కోటా సీట్లను ప్రవాసుల పిల్లలు లేదా వారు స్పాన్సర్‌ చేసిన వారితో భర్తీ చేసేవారు. ఈ ఏడాది కేవలం ఎన్నారైల పిల్లలతోనే భర్తీ చేయాలనే నిబంధన తీసుకొచ్చారు. ఎన్నారై స్పాన్సర్డ్‌ ఐచ్ఛికాన్ని తొలగించారు. ఎన్నారైల పిల్లలు ప్రవేశాలు తీసుకోకపోతే 15శాతంలో మిగిలిన సీట్లను నాన్‌ ఎన్నారై కోటాకు మార్పు చేస్తారు. యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించనుంది. ఆన్‌లైన్‌లో విద్యార్థులు నేరుగా యాజమాన్య కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. కళాశాలల యాజమాన్యాలు బీ కేటగిరి కింద వచ్చిన దరఖాస్తులను ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తర్వాత జేఈఈ మెయిన్‌, ఎంసెట్‌లలో వచ్చిన ర్యాంకులు, ఈ రెండూ రాయకపోతే ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితాను కళాశాలలు రూపొందించాల్సి ఉంటుంది. ఈ జాబితాలోని అభ్యర్థులకు వరస క్రమంలో సీట్లు కేటాయించాలి. యాజమాన్య కోటా ఫీజును చెల్లించే స్థోమత విద్యార్థులకు లేదని యాజమాన్యం భావిస్తే సీటును తిరస్కరించే నిబంధన విధించారు. అయితే దీనిని సాకుగా చూపి యాజమాన్యాలు అర్హులైన వారికి సీట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టే పరిస్థితి ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నారై, నాన్‌ ఎన్నారై సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. ఎన్నారై కోటాలో చేరే విద్యార్థులు ఐదువేల అమెరికా డాలర్లు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. నాన్‌ ఎన్నారై కోటాలో చేరే వారు కన్వీనర్‌ ఫీజుపై మూడింతలు చెల్లించాలి. మూడింతల ఫీజును నిర్ణయించడాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విజయం.. ఇలా సాధ్యం!

‣ GATE: గెలుద్దాం.. గేట్‌!

‣ ఉరుముతున్న ఆర్థిక సంక్షోభం

‣ ‘సీపెక్‌’కు నిధుల కటకట

‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.