* ఒప్పంద ప్రాతిపదికన జిల్లాల వారీగా భర్తీ
* 17న దరఖాస్తులకు తుది గడువు
ఈనాడు, హైదరాబాద్: పల్లె, బస్తీ దవాఖానాల బలోపేతమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 1,569 వైద్య పోస్టులు మంజూరు చేసింది. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పేరిట ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులు నింపనున్నారు. ఇందులో బస్తీ దవాఖానాల్లో 349, పల్లె దవాఖానాల్లో 1,220 కలిపి 1569 పోస్టుల భర్తీకి సెప్టెంబరు 7న ఉత్తర్వులు జారీ అయ్యాయి.
* బస్తీ, పల్లె దవాఖానాల్లో ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేయడానికి ఎంబీబీఎస్/బీఏఎంఎస్ అర్హత కలిగిన వైద్యులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. పల్లె దవాఖానాల్లో ఈ పోస్టులో పనిచేయడానికి ఎంబీబీఎస్/బీఏఎంస్ వైద్యులు రాకుంటే.. 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రులు లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్/జీఎన్ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్ ప్రోగ్రాం పూర్తిచేసిన వారిని తీసుకుంటారు.
ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేసే ఎంబీబీఎస్/బీఏఎంఎస్ వైద్యులకు నెలకు రూ.40 వేలు, ఈ పోస్టులో పనిచేసే స్టాఫ్‌నర్సులకు నెలకు రూ.29,900 చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తారు. అర్హత వయసు 18 - 44 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు అయిదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది. జిల్లా నియామక కమిటీ నేతృత్వంలో భర్తీ ప్రక్రియ నిర్వహిస్తారు. జిల్లాల్లో సెప్టెంబరు 7న నియామక ప్రకటన వెలువడింది. దరఖాస్తు దాఖలుకు సెప్టెంబరు 17 తుది గడువుగా ప్రకటించారు. అర్హుల జాబితాను 29న వెల్లడించి, అభ్యంతరాలుంటే 30న స్వీకరిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన తుది అర్హుల జాబితాను అక్టోబరు 3న ప్రదర్శిస్తారు.
జిల్లాల వారీ ఖాళీల వివరాల కోసం క్లిక్ చేయండి
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఏ ఉద్యోగ పరీక్షకు సిద్ధం కావాలి?
‣ ఏపీఈఏపీ సెట్ ప్రవేశాల్లో మార్పులు
‣ శాస్త్రసాంకేతిక అగ్రశక్తిగా చైనా
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.