• facebook
  • whatsapp
  • telegram

Contract Jobs: కాంట్రాక్టు ఉద్యోగాల రాత పరీక్ష రద్దు

ఒకే గదిలో 400 మంది అభ్యర్థులు
అర్హులందరికీ హల్‌టికెట్లు ఇవ్వలేదని అభ్యర్థుల ఆందోళన
ఏజెన్సీ నిర్వాకంతో కొత్తగూడెం మెడికల్‌ కళాశాలలో ఉద్రిక్తత

కొత్తగూడెం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: కొత్తగూడెం మెడికల్‌ కళాశాలలో పలు పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించాల్సిన రాత పరీక్ష రద్దయ్యింది. సంబంధిత ఏజెన్సీ అస్తవ్యస్త నిర్వహణే ఇందుకుకారణం. నూతన కళాశాలలో 32 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయాల్సి ఉంది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో ఎంపిక ప్రక్రియను ‘ఆరో ఎంటర్‌ప్రైజెస్‌’ అనే ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. సదరు సంస్థ సుమారు 4 వేల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వారిలో అర్హులందరికీ హాల్‌టికెట్లు జారీ చేశామని చెప్పింది. ఆదివారం మధ్యాహ్నం మెడికల్‌ కళాశాలలో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. కానీ ఏజెన్సీవారు వేయిమందికే హాల్‌టికెట్లు ఇచ్చారని ఆరోపిస్తూ సుమారు 3 వేల మంది అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి తరలిరావడంతో సాయంత్రం వరకు ఉద్రిక్తత నెలకొంది. ‘పరీక్ష తేదీపై సమాచారమే లేదు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురైతే ఆ విషయం ఎందుకు చెప్పలేదు? కేంద్రం వద్ద పడేసిన హాల్‌టికెట్లను సంబంధీకులకు పంపకపోవడంలో ఉద్దేశం ఏమిటి?’ అంటూ నినదించారు. మరోవైపు ఒకే గదిలో 400 మందికిపైగా అభ్యర్థులను పక్కపక్కనే కూర్చోబెట్టి పరీక్ష నిర్వహించాలని ప్రయత్నించారని ఆందోళన చేశారు. కళాశాల వైద్యాధికారులతో పాటు పాల్వంచ తహసీల్దారు రంగాప్రసాద్‌, సీఐ నాగరాజు, ఎస్సైలు నరేశ్‌, శ్రీనివాస్‌ అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. నిబంధనలు పాటించనందున పరీక్షను రద్దు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డా.లక్ష్మణరావు ప్రకటించారు. ‘ఆరో’ ఏజెన్సీని కూడా తప్పిస్తున్నామన్నారు. అక్టోబరు చివరి వారంలో కొత్త ఏజెన్సీ ద్వారా పకడ్బందీగా పరీక్ష జరిగేలా చూస్తామని భరోసా ఇవ్వడంతో ఆందోళనకారులంతా వెనుదిరిగారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఐఎన్‌సీఓఐఎస్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు

‣ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి ఎన్‌మాట్‌ మార్గం!

‣ ఫార్మా నిపుణులకు తరగని డిమాండ్‌!

‣ ప్రసిద్ధ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ పీజీ!

‣ వదిలేయడాన్ని వదిలేయండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.