• facebook
  • whatsapp
  • telegram

Engineering: ఇంజినీరింగ్‌ బీకేటగిరీ సీట్ల భర్తీ ఎప్పుడు?

 

ఈనాడు, అమరావతి: ఈఏపీసెట్‌ కేటగిరి-బీ (యాజమాన్యకోటా) సీట్ల భర్తీపై ఉన్నత విద్యామండలి తీవ్ర జాప్యం చేస్తోంది. ఏ విధానంలో భర్తీ చేస్తుంది? విద్యార్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? నేరుగా కళాశాలలకు వెళ్లాలా? ఎప్పటి నుంచి చేపడతారు?వంటి విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు. కేటగిరి-బీ సీట్ల భర్తీ ఎలా ఉంటుంది? ఎప్పటి నుంచి చేపడతామనే విషయాన్ని కళాశాలలకు చెప్పడం లేదు. దీంతో విద్యార్థులు కళాశాలల చుట్టూ తిరుగుతున్నారు. కేటగిరి-బీలో చేరే విద్యార్థులు కన్వీనర్‌ కోటా ఫీజుపై మూడింతలు చెల్లించాలనే నిబంధన విధించారు.  కొన్ని యాజమాన్యాలు మాత్రం డొనేషన్లు తీసుకుంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకునే వారు కనిపించడం లేదు. కన్వీనర్‌ కోటా మొదటి విడత సీట్ల భర్తీ పూర్తి కావడంతో కోరుకున్న కళాశాలల్లో సీట్లు లభించని వారు యాజమాన్య కోటాలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.