• facebook
  • whatsapp
  • telegram

TS Police Jobs: అక్టోబ‌రు 27 నుంచి ధ్రువీకరణపత్రాల సమర్పణ (పార్ట్‌-2) ప్రారంభం

ఆన్‌లైన్‌ ప్రక్రియకు నవంబరు 10 వరకు గడువు

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి నియామకాలకు సంబంధించి ప్రాథమిక రాతపరీక్ష ఫలితాలను విడుదల చేసిన నేపథ్యంలో.. కీలకమైన ధ్రువీకరణపత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించే ప్రక్రియ అక్టోబ‌రు 27 నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన వారంతా వాటిని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు అక్టోబ‌రు 27 నుంచి నవంబరు 10 వరకు గడువు ఉంది. ‘పార్ట్‌-2’గా పిలిచే ఈ ప్రక్రియలో.. అవసరమైన అన్ని ధ్రువీకరణపత్రాలను (సర్టిఫికెట్లు) అప్‌లోడ్‌ చేస్తేనే అభ్యర్థులు తదుపరి దశకు అర్హత సాధిస్తారు. వివిధ పోస్టులకు గాను దాదాపు 2.69 లక్షల మంది ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించడంతో రోజుకు సగటున 18,000 మంది వెబ్‌సైట్‌ను ఆశ్రయించే అవకాశం ఉంది. అభ్యర్థులు గడువు చివరివరకు ఆగకుండా ముందుగానే ధ్రువీకరణపత్రాలను సమర్పించడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండలి వర్గాలు సూచిస్తున్నాయి.
స్థానికత కీలకాంశం..
రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నియామక ప్రక్రియ జరుగుతుండటంతో స్థానికత అంశం కీలకంగా మారింది. ఈ మేరకు తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ఉద్యోగాలను జిల్లా, కంటీజియస్‌ జిల్లా కేడర్‌గా విభజించారు. ఆయా కేడర్లలో స్థానికులకే 95% ఉద్యోగావకాశాలుండటంతో అభ్యర్థులు స్థానికతను రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకుగాను 1 నుంచి 7వ తరగతి వరకు చదువుకున్న పాఠశాలల నుంచి పొందిన స్టడీ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఆ ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ ప్రాంతమే స్థానికత కానుంది. ఒకవేళ ఈ పత్రాల్ని సమర్పించకపోతే స్థానికేతరులుగానే పరిగణించనున్నారు. అప్పుడు కేవలం 5% నాన్‌లోకల్‌ కోటాలోనే పోటీపడాల్సి వస్తుంది. కుల ధ్రువీకరణపత్రాలు సమర్పించడంలో విఫలమైతే జనరల్‌ కేటగిరీగానే పరిగణనలోకి తీసుకుంటారు.
సమర్పించాల్సిన ధ్రువీకరణపత్రాలివే..
‣ 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ/కాండక్ట్‌ సర్టిఫికెట్లు. గుర్తింపు పొందిన పాఠశాలలో చదవకుంటే తహశీల్దారు జారీచేసిన నివాస ధ్రువీకరణపత్రం.
‣ పుట్టినతేదీ నిర్ధారణకు పదో తరగతి మెమో.
 ఎస్సై పోస్టులకు డిగ్రీ, కానిస్టేబుల్‌ స్థాయికి ఇంటర్‌ మెమో.
‣ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వయోపరిమితి సడలింపునకు కుల ధ్రువీకరణపత్రం.
‣ ఓసీల్లో నిరుపేదలకు వయోపరిమితి సడలింపునకు ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణపత్రం.
‣ బీసీ అభ్యర్థులు రిజర్వేషన్‌ పొందేందుకు 2021 ఏప్రిల్‌ 1 తర్వాత పొందిన నాన్‌-క్రీమీలేయర్‌ సర్టిఫికెట్‌.
‣ ఎస్టీ అభ్యర్థులు ఎత్తులో సడలింపునకు ఏజెన్సీ ఏరియా ధ్రువీకరణపత్రం.
‣ తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల కోటాలో వయోపరిమితి సడలింపునకు సర్వీస్‌ సర్టిఫికెట్‌.
‣ మాజీ సైనికోద్యోగులు వయోపరిమితి సడలింపు లేదా ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటా ఉద్యోగాల కోసం పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌ లేదా డిశ్ఛార్జి బుక్‌.

 

********************************************************

స్టడీ మెటీరియ‌ల్‌ - మెయిన్స్

‣ పేపర్ - 1: ఇంగ్లిషు
‣ పేపర్ : 2: తెలుగు
‣ పేపర్ - 3: అర్థమెటిక్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ
 పేపర్ - 4: జనరల్ స్టడీస్

 

‣ పాత ప్రశ్నప‌త్రాలు

‣ నమూనా ప్రశ్నపత్రాలు

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!

‣ డిగ్రీతో ఐఐటీలో ఉద్యోగాలు

‣ కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!

‣ అమ్మకాల దళంలో చేరతారా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.