• facebook
  • whatsapp
  • telegram

Transport Charges: అర్హత ఉన్నా.. అందని భత్యం

దరఖాస్తు దారుల ఎదురుచూపులు
మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే: సొంతూరిలో పాఠశాల లేక ఇతర గ్రామాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులకు విద్యాహక్కు చట్టం ప్రకారం రవాణా భత్యం వర్తిస్తుంది. పేద విద్యార్థులు చదువులకు దూరం కాకూడదని అమలు చేస్తున్న ఈ పథకం పూర్తి స్థాయిలో దరిచేరలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బస్సు సౌకర్యం లేనివారు కాలినడకన, ఇతర ప్రైవేటు వాహనాల్లో పాఠశాలలకు చేరుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం నెలకు రూ. 600 చొప్పున రవాణా భత్యం కింద విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉన్నా మోక్షం లభించట్లేదు. 10 నెలలకుగానూ ఒక్కో విద్యార్థికి రూ.6 వేల వరకు అందే అవకాశం ఉంటుంది. విద్యాసంవత్సరం ప్రారంభమై 6 నెలలు కావొస్తున్నా ఇప్పటికీ ఏ ఒక్కరికీ రవాణా భత్యం అందలేదు.
 జిల్లాలో 714 ప్రభుత్వ పాఠశాలలు, 5 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 60 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. మరోగ్రామంలోని పాఠశాలలకు వెళ్లి చదువుకునే వారి సంఖ్య వేలల్లో ఉన్నా వీరిలో రవాణా భత్యానికి మాత్రం కేవలం 748 మంది మాత్రమే అర్హులు ఉన్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారులు రాష్ట్ర విద్యాశాఖకు నివేదికలు అందించారు. ప్రాథమిక పాఠశాలకు కిలోమీటరు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్లు, 9, 10 తరగతుల విద్యార్థులు 5 కిలోమీటర్ల దూరం బడులకు వెళ్లి చదువుతున్న విద్యార్థ్థులు రవాణా భత్యం పొందేందుకు అర్హులు.
‣ సరైన అవగాహన లేక చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రవాణా భత్యంపై అవగాహన కల్పించడం లేదు. అర్హత ఉన్నప్పటికీ భత్యాన్ని అందుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు చాలా మంది బ్యాంకు ఖాతాలను తెరవలేదు. ప్రాథమిక పాఠశాలల్లో 41 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 41 మంది, ఉన్నత పాఠశాలల్లో 483 మంది విద్యార్థులు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. 183 మంది విద్యార్థులు అర్హత ఉన్నప్పటికీ అవగాహన లేక ఇప్పటికీ బ్యాంకు ఖాతా  తెరవలేదు. గతేడాది 2021-22 సంవత్సరానికి గానూ 535 మంది దరఖాస్తులు చేసుకున్న ఇప్పటికీ రవాణా భత్యం అందకపోవడం గమనార్హం.
నిధులు విడుదల కావాలి: వెంకటేశ్వర్లు, డీఈవో
రవాణా భత్యానికి సంబంధించి నివేదికలు ఇప్పటికే రాష్ట్ర స్థాయికి అందించాం. ప్రభుత్వ నుంచి నిధులు విడుదల కాగానే విద్యార్థుల ఖాతాలో జమచేస్తాం.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.