మాచవరం, న్యూస్టడే: నగరంలోని ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిసెంబరు మొదటి వారంలో ప్రారంభమయ్యే జర్మన్, అరబిక్, సైన్ లాంగ్వేజ్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి తెలిపారు. ఇప్పటికే ఫ్రెంచ్, అరబిక్, జర్మన్ భాషల్లో కోర్సులు ఉన్నాయని చెప్పారు. విదేశీ భాషలపై నిర్వహిస్తున్న ఈ సర్టిఫికెట్ కోర్సులను.. నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విదేశీ భాషా కోర్సుల సమన్వయకర్త డాక్టర్ డి.రాజలక్ష్మి కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్ 98494 91969, 70328 67645 (జర్మన్), 98481 70255 (అరబిక్), 95535 63955 (సైన్ ల్యాంగ్వేజ్)లలో సంప్రదించాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.