• facebook
  • whatsapp
  • telegram

Court Exams: జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి పరీక్షల తేదీలు

ఈనాడు, అమరావతి: జిల్లాకోర్టుల్లో 3,432 ఉద్యోగాల భర్తీకి పరీక్ష తేదీల్ని వెల్లడిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ ఎస్‌.కమలాకరరెడ్డి న‌వంబ‌రు 23న‌ ఉత్తర్వులిచ్చారు. స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3/జూనియర్‌ అసిస్టెంట్‌/టైపిస్టు/ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబరు 21న మూడు విడతలు, 22న మూడు, 23న ఒక విడత, 29న రెండు విడతలు, జనవరి 2న మూడు విడతల్లో పరీక్ష ఉంటుంది. కాపీయిస్టు/ఎగ్జామినర్‌/రికార్డు అసిస్టెంట్‌ పోస్టులకు డిసెంబరు 26న రెండు విడతల్లో ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. డ్రైవర్‌/ప్రాసెస్‌ సర్వర్‌/ఆఫీసు సబార్డినేట్‌ పోస్టులకు డిసెంబరు 26న ఒక విడత, 27న మూడు, 28న మూడు విడతలు, 29న ఒకవిడతలో ఉమ్మడి పరీక్ష ఉంటుంది. డిసెంబరు 16 నుంచి హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.