ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో సంస్కరణలు, వ్యూహాత్మక కార్యక్రమాల అమలును సమర్థవంతంగా పరిశీలించేందుకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) రెండు పోర్టళ్లను ప్రారంభించింది. ఉన్నత విద్యలో పరివర్తన వ్యూహాలు, తీసుకునే చర్యలు(ఉత్సాహ్), ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ పథకం(పీవోపీ) పేరుతో వీటిని తీసుకొచ్చింది. జాతీయ విద్యా విధానం-2020 అమలులో సాధించిన పురోగతిని పంచుకోవడానికి ఉత్సాహ్ వేదికగా ఉంటుంది. ఉన్నత విద్యా సంస్థల్లో బోధించేందుకు అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లను గుర్తించేందుకు పీవోపీని తీసుకొచ్చింది. ఏదైనా విభాగంలో నిపుణుల కోసం వెతికే ఉన్నత విద్యా సంస్థలు ఈ పోర్టల్ నమోదు చేసుకోవచ్చు. అలాగే నిపుణులు తమ ప్రొఫైళ్లను ఇందులో అప్‌లోడ్ చేసుకోవచ్చు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.