• facebook
  • whatsapp
  • telegram

Scholarships: భారత విద్యార్థులకు ఇంపీరియల్‌ కాలేజీ భారీ స్కాలర్‌షిప్‌లు

లండన్‌: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ యూనివర్సిటీ ఇంపీరియల్‌ కాలేజీ లండన్‌ భారత విద్యార్థుల కోసం భారీ స్కాలర్‌షిప్‌ కార్యక్రమాన్ని ప్రకటించింది. ద ఫ్యూచర్‌ లీడర్స్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాం కింద వచ్చే మూడేళ్లలో భారత్‌కు చెందిన ప్రతిభ గల 30 మంది మాస్టర్స్‌ స్కాలర్స్‌ విద్యార్థులను ప్రోత్సహించనుంది. ఈ క్రమంలో 15 మంది పురుష, 15 మంది మహిళా విద్యార్థులకు ప్రయోజనం దక్కనుంది. ‘‘భారత సైంటిస్టుల కోసం ఈ స్కాలర్‌షిప్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. భిన్న నేపథ్యాలు కలిగిన అత్యంత ప్రతిభావంతులను ఆకట్టుకోవడానికి, వారి అభ్యున్నతికి మద్దతివ్వడానికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని ఇంపీరియల్‌ కాలేజీ లండన్‌ ప్రొఫెసర్‌ పీటర్‌ హయ్‌నెస్‌ నవంబర్‌ 1న వెల్లడించారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ కొలువు సాధనకు తొలి అడుగు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.