• facebook
  • whatsapp
  • telegram

రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

* సక్సెస్‌ ప్లాన్‌కు సూచనలు

రెజ్యూమె.... ఎదుటివారికి మనపై కలిగే తొలి అభిప్రాయం. అది ఎంత పాజిటివ్‌ కోణంలో ఉంటే... మన పని అంత సులువుగా జరుగుతుంది. అయితే ఇందులో అకడమిక్‌ గ్యాప్‌ లేదా ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్న సమయం మనల్ని కాస్త ఇబ్బంది పెట్టే అంశం. దీనికి సంబంధించి ప్రశ్నలు ఎదుర్కొనే సమయంలో ఏం చేయాలంటే...


ఏదైనా ముఖాముఖి పరీక్షకు హాజరయ్యేటప్పుడు... విద్యార్థిగానైనా, ఉద్యోగంలో చేరాక అయినా ఏడాది, రెండేళ్లు ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తే... అది అవతలివారిని మనపట్ల ఆలోచనలో పడేస్తుంది. మనకిచ్చే అవకాశాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ విరామం అనివార్యంగా వస్తుంటుంది. అందుకే  దీనికి సంబంధించిన ప్రశ్నలకు కొంత ఆలోచించి సమాధానాలు ఇవ్వాలి. అప్పుడే మనకు రావాల్సిన అవకాశంపై ఎటువంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడొచ్చు.


ఇటువంటి సమయాల్లో మొట్టమొదట చేయాల్సిన విషయం ఆ ఖాళీ గురించి నిజాయతీగా చెప్పడం. రెజ్యూమెలోనైనా, నేరుగానైనా గ్యాప్‌ గురించి పూర్తిగా నిజమే చెప్పాలి. అదే సమయంలో మీరు కొత్త విషయాలు నేర్చుకోవడం ఎక్కడా ఆపలేదు అనే అంశాన్ని స్పష్టం చేయాలి. మీకున్న అదనపు నైపుణ్యాలను ప్రస్తావిస్తూ, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నామనే భావన కల్పించవచ్చు. ఎట్టిపరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పడానికి ప్రయత్నించకూడదు. కంపెనీ వారు కనుక్కోవాలి అనుకుంటే వాస్తవం ఎలా అయినా తెలిసిపోతుందనే విషయాన్ని గ్రహించాలి. అందువల్ల నిజాయతీగా ఉండటమే మంచిది.


అలాగే ఈ ప్రశ్న ఎదురుకాగానే తడబడటం, జవాబు కోసం తడుముకోవడం వంటివి చేయకూడదు. ముందే అడుగుతారనే విషయాన్ని గమనించి తగిన విధంగా జవాబుతో సన్నద్ధం కావాలి.


ఈ ఖాళీకి కారణాలు చెప్పాల్సి వస్తే... కుటుంబ కారణాలు, అనారోగ్యం, గాయాలు, మీకు నచ్చిన చదువు - ఉద్యోగం ఏదో గుర్తించడానికి ప్రయత్నం చేయడం, ఏదైనా వ్యాపారం నడపడం వంటివన్నీ చెప్పొచ్చు. ఇంతకంటే వేరే కారణాలు చెప్పేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించాలి.


ఖాళీలపై అంతగా ఫోకస్‌ చేయని విధంగా ఉండే రెజ్యూమె ఫార్మాట్లను ఎంచుకోవడం ఉత్తమం. అప్పుడు ఇంటర్య్వూ చేసే వ్యక్తి దాన్ని గుర్తించేందుకు, గుర్తించినా ప్రశ్నించేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది.


ఖాళీగా ఉండటంకంటే కూడా, దాన్ని మనం ఎలా వివరించామనే దాన్ని బట్టే అవతలివారి అభిప్రాయం ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఖాళీకి కారణం ఏదైనా పాజిటివ్‌ కోణంలో చెప్పేందుకు, సరైన కారణాలు ఇచ్చేందుకు ప్రయత్నించాలి.


ఈ ఖాళీలు ‘వీరు తరచూ జాబ్‌ వదిలి వెళ్లిపోతున్నారు’ అని అనుకోవడానికి ఆధారం కాకూడదు. అలాంటివారిని ఉద్యోగంలోకి తీసుకుంటే శిక్షణ ఇచ్చి సమయాన్ని వృథా చేసుకోవడం అని కంపెనీలు భావిస్తాయి. అందువల్ల మనం ఎక్కడైనా స్థిరంగా పనిచేయగలుగుతాం అనే భావన కల్పించాలి.


చక్కని డిగ్రీ, మెరుగైన మార్కులు, ఆకట్టుకునే ప్రతిభ ఉంటే... సమయం విరామం అనేది పెద్ద విషయంగా కనిపించదు. తాజాగా ఎటువంటి ఖాళీ ఉన్నా, దాన్ని నిజాయతీగా ఒప్పుకుని, సరైన విధంగా వివరిస్తే.. అనుకున్న అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు.


 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొలువు సాధనకు తొలి అడుగు!

‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!

‣ ఐటీలో ట్రెండింగ్‌ కోర్సులు

‣ మైక్రోసాఫ్ట్‌లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్‌ విద్యార్థిని సంహిత ఘనత

‣ మీ కెరియర్‌ ‘డిజైన్‌’ చేసుకోండి!

‣ ఏపీపీఎస్సీ గ్రూప్‌-1, 2 గెలుపు వ్యూహం

‣ ఆత్మన్యూనతతో అనర్థాలే!

‣ బ్యాంకులో కోర్సు.. ఆపై కొలువు!

Posted Date: 28-09-2023


 

ఉద్యోగాన్వేష‌ణ‌

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం