* పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్టీఏ
ఈనాడు ప్రతిభ డెస్క్: ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష వచ్చే ఏడాది మే 26న నిర్వహిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 21 నుంచి 30వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రుసుము మే 6వ తేదీలోగా చెల్లించాలి. అడ్మిట్ కార్డులు మే 17 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత పొందిన వారికి అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ తదితర మేటి సంస్థల్లో అడ్మిషన్లకు మెయిన్స్ ర్యాంకే ఆధారం.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.