• facebook
  • whatsapp
  • telegram

NEET UG 2024: నీట్‌ యూజీ 2024 అడ్మిట్‌కార్డులు

* మే 5వ తేదీన పరీక్ష

* తెలుగులోనూ ప్రశ్నపత్రం

ఈనాడు ప్రతిభ డెస్క్‌: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (National Eligibility-cum-Entrance Test) యూజీ (NEET UG 2024) అడ్మిట్‌కార్డులను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసింది. పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 571 కేంద్రాల్లో పరీక్ష జరుగనుంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నీట్‌ యూజీ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, కోర్సు, సెక్యూరిటీ పిన్‌ వివరాలు నమోదు చేసి అడ్మిట్‌కార్డు (Admit Card) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో మే 5న మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది. పరీక్ష (Examination) వ్యవధి 200 నిమిషాలు (3 గంటల 20 నిమిషాలు). ఎంబీబీఎస్‌(MBBS), బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించనున్నారు. 
 


 Download  NEET UG 2024 Admitcard  


 

  NEET  Study Material  
 

Biology
Chemistry
Physics


 

  ♦ NEET Previous Papers  2024  


  ♦  Model Papers 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.