• facebook
  • whatsapp
  • telegram

Education: శ్రేష్ఠతర కేంద్రాలుగా సర్కారు పాలిటెక్నిక్‌లు

* తొమ్మిది ప్రభుత్వ కళాశాలల గుర్తింపు


ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలను అన్ని విధాలా ఆధునికీకరించి, అత్యాధునిక ప్రయోగశాలలుగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బీటెక్‌ రెండేళ్లు పూర్తి చేసి చదువు ఆపేసే వారికి డిప్లొమా సర్టిఫికెట్‌ ఇస్తామని నూతన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్నారు. అందుకే పాలిటెక్నిక్‌లను ఇంజినీరింగ్‌ కళాశాలల స్థాయికి ఉన్నతీకరించాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తొలుత రాష్ట్రంలోని 58 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో తొమ్మిదింటిని శ్రేష్ఠతర కేంద్రాలు(సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌)గా మార్చాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నిర్ణయించారు. ఈ క్రమంలో ఆ కళాశాలల్లోని ల్యాబ్‌ల ఆధునికీకరణకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. సుమారు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు వ్యయం కావొచ్చని అంచనా. 

 

 కళాశాల అభివృద్ధి చేసే ల్యాబ్‌
మాసబ్‌ ట్యాంకు మెకానికల్‌ అండ్‌ ఆటోమొబైల్‌
జీఐఈ(సికింద్రాబాద్‌)  ఎలక్ట్రానిక్‌
రామంతాపూర్‌ సివిల్‌
కులీకుతుబ్‌షా  ఎలక్ట్రికల్‌
జీపీడబ్ల్యూ(వెస్ట్‌ మారేడుపల్లి) కంప్యూటర్స్‌
మహబూబ్‌నగర్‌  మెకానికల్‌
నిజామాబాద్‌ ఎలక్ట్రికల్‌
వరంగల్‌ సివిల్‌
కొత్తగూడెం మైనింగ్‌ 


 

మరింత సమాచారం... మీ కోసం

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.