• facebook
  • whatsapp
  • telegram

Free Training: కంప్యూటర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: భారతీయ విద్యాభవన్‌లోని గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్‌ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భారతీయ విద్యాభవన్‌ హైదరాబాద్‌ కేంద్ర సహాయ సంచాలకులు వి.శ్రీరామ్‌ డిసెంబరు 12న పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఆఫీస్‌ అసిస్టెంట్‌ కోర్సు, టాలీ ఈఆర్పీ-9, డీటీపీ, అకౌంట్స్‌ అసిస్టెంట్‌ కోర్సులకు ఉచితంగా కంప్యూటర్‌ శిక్షణ ఇస్తున్నామన్నారు. జనవరి 5 నుంచి ప్రారంభమయ్యే బ్యాచ్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. బషీర్‌బాగ్‌లోని భారతీయ విద్యాభవన్‌ కులపతి మున్షీ సదన్‌లో దరఖాస్తు సమర్పించాలని, డిసెంబర్‌ 28 చివరితేదీ అని సూచించారు. దరఖాస్తుదారులు 31 డిసెంబర్‌ 2023 నాటికి 17 సంవత్సరాల 9 నెలల వయసు నుండి 34 సంవత్సరాల 9 నెలల మధ్య ఉండాలని సూచించారు. ఇంటర్మీడియట్‌ కనీస విద్యార్హతగా ఉండి, అల్పాదాయ వర్గాలకు చెందిన వారై ఉండాలన్నారు. ఇతర వివరాలకు 040-23241629,  23237825, 23230755 సంప్రదించాలని పేర్కొన్నారు. 
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్‌లో ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.