• facebook
  • whatsapp
  • telegram

CAT 2023: క్యాట్-2023 ఫలితాలు విడుదల

* రిజల్ట్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే..
* ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేసేందుకు అవకాశం కల్పించే ప్రవేశ పరీక్ష- కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌) 2023 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సాయంతో స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. క్యాట్‌లో సాధించిన పర్సంటైల్‌ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్‌ స్కోరు ఆధారంగా ఐఐఎంలే కాకుండా పేరున్న కళాశాలలు కూడా తమ కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తాయి. దేశవ్యాప్తంగా మొత్తం 155 న‌గ‌రాల్లో నవంబర్‌ 26న పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 

సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

క్యాట్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించారు. మొత్తంగా 14 మంది 100 పర్సంటైల్‌తో మెరిశారు. ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఒకరు ఉన్నారు. మొత్తంగా 72మంది టాపర్లుగా నిలవగా.. 14మంది విద్యార్థులకు 100 పర్సంటైల్‌; 29 మందికి 99.99 పర్సంటైల్‌; 29 మందికి 99.98 పర్సంటైల్‌ సాధించారు. 100పర్సంటైల్‌ సాధించిన వారిలో మహారాష్ట్ర నుంచి అత్యధికంగా నలుగురు ఉండగా.. దిల్లీ, గుజరాత్‌, జమ్మూకశ్మీర్‌, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.




  క్యాట్-2023 స్కోర్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి   

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.