• facebook
  • whatsapp
  • telegram

CBSE: సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు

* పోటీ పరీక్షల దృష్ట్యా కొత్త టైంటేబుల్‌

దిల్లీ: సీబీఎస్‌ఈ (CBSE) 10, 12వ తరగతి పరీక్షల డేట్‌ షీట్‌ను బోర్డు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ టైం టేబుల్‌ (Time Table)లో కొన్ని మార్పులు చేశారు. కొన్ని సబ్జెక్టులను రీషెడ్యూల్‌ చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు రివైజ్‌ చేసిన పరీక్షల తేదీలను తాజాగా విడుదల చేసింది. 10వ తరగతి షెడ్యూల్‌లో ఫిబ్రవరి 16న జరగాల్సిన రిటైల్‌ పేపర్‌ను ఫిబ్రవరి 28వ తేదీకి మార్చారు. మార్చి 4, 5 తేదీల్లో జరగాల్సిన టిబెటన్‌, ఫ్రెంచ్‌ పరీక్షలను ముందుకు తీసుకొచ్చారు. ఫిబ్రవరి 20న ఫ్రెంచ్‌, ఫిబ్రవరి 23న టిబెటన్‌ పరీక్షను నిర్వహించనున్నారు. ఇక, 12వ తరగతిలో కేవలం ఫ్యాషన్‌ స్టడీస్‌ సబ్జెక్టు పరీక్ష తేదీ మాత్రమే మారింది. మార్చి 11న జరగాల్సిన ఈ పరీక్షను మార్చి 21వ తేదీకి మార్చారు. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్‌ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్‌ వంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ డేట్‌ షీట్‌లను రూపొందించినట్లు పరీక్షల కంట్రోలర్‌ డా.సన్యం భరద్వాజ్‌ గతంలో వెల్లడించారు.


 

   సీబీఎస్‌ఈ 10వ తరగతి రివైజ్డ్‌ టైం టేబుల్   
 

  సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌  

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.