1. బిహారీ ‘జన నాయక్’కు భారతరత్న
బిహారీ ‘జన నాయక్’గా ప్రసిద్ధి పొందిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కర్పూరీ ఠాకుర్కు కేంద్రం భారతరత్న ప్రకటించింది. దేశానికి, ముఖ్యంగా బిహార్ ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ఆయన మరణించిన 36 ఏళ్లకు, ఆయన 100వ జయంతికి ఒక రోజు ముందు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికచేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. భారీ డేటా లీక్
చరిత్రలోనే అతి పెద్ద డేటా లీక్ వ్యవహారం బయటపడింది. యూజర్ల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన దాదాపు 2,600 కోట్ల రికార్డులు బహిర్గతమయ్యాయి. ఎక్స్ (ట్విటర్), లింక్డ్ఇన్ వంటి ప్రముఖ వెబ్సైట్ల యూజర్ల వివరాలూ ఇందులో ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ‘బాలక్ రామ్’గా అయోధ్య రామయ్య
భవ్య మందిరంలో అయిదేళ్ల బాలుడి విగ్రహ రూపంలో కొలువుదీరిన అయోధ్య రామయ్యను ఇక నుంచి ‘బాలక్ రామ్’గా పిలవనున్నారు. రామజన్మభూమి ట్రస్టు పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఉత్తమ క్రికెటర్గా గిల్
బీసీసీఐ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ 2022-2023 సంవత్సరానికి ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా పాలి ఉమ్రిగర్ అవార్డును అందుకున్నాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. హైదరాబాద్లో కొరియా కాస్మొటిక్ సంస్థ
దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత కాస్మొటిక్ ఉత్పత్తుల సంస్థ డూసన్ హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందుకొచ్చింది. సుమారు రూ.5 వేల కోట్లతో దేశంలోనే మొదటి కాస్మొటిక్ ఉత్పత్తుల కేంద్రాన్ని స్థాపించనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.