• facebook
  • whatsapp
  • telegram

DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

* బీఈడీ చేసిన వారికి ఎస్జీటీ పోస్టులకు అవకాశం

* ప్రిన్సిపల్‌, పీజీటీ, టీజీటీలకు ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష

* 6,100 పోస్టుల భర్తీకి నియామక పరీక్ష

* ఉపాధ్యాయుల్లో నిబద్ధతకే అప్రెంటిస్‌ విధానం మంత్రి బొత్స

ఈనాడు, అమరావతి: ఎంపికైన ఉపాధ్యాయులు నిబద్ధతతో పని చేయాలనే అప్రెంటిస్‌ విధానం తీసుకొచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అప్రెంటిస్‌షిప్‌ పూర్తి కావాలని, నిబద్ధతతో శిక్షణలో భాగస్వాములు కావాలనే ఉద్దేశం కొత్తగా వచ్చే ఉపాధ్యాయుల్లో ఉండాలనే ఈ విధానం తీసుకొచ్చామని చెప్పారు. గురువులకు నిరంతరం నేర్చుకోవాలనే తపన ఉండాలని సూచించారు. డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను మంత్రి బొత్స విడుదల చేసి, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో 36 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్‌లో చెప్పిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. అన్ని ఖాళీలు ఉన్నాయన్నది సత్యదూరం. కేంద్ర ప్రభుత్వం ఆ సమాచారం ఎక్కడి నుంచి తీసుకుందో మాకు తెలియదు. ఈ విద్యా సంవత్సరంలో ఎలాంటి ఖాళీలు లేకుండా 6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నాం. భవిష్యత్తులో ఏ ఏడాది ఖాళీలను ఆ సంవత్సరమే భర్తీ చేస్తాం’ అని వెల్లడించారు. అనంతరం పాఠశాల విద్య కమిషనర్‌ మాట్లాడుతూ.. గతంలో రాజస్థాన్‌ రాష్ట్రానికి సంబంధించిన కేసులో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ వారికి అర్హత లేదని సుప్రీంకోర్టు చెప్పిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చనే స్వేచ్ఛనిచ్చిందని పేర్కొన్నారు. అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు దీనిపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. డీఎస్సీ-2018లో పాటించిన అర్హతలు, నిబంధనలు అమలు చేస్తున్నామని వివరించారు.

సహాయ కేంద్రం ఏర్పాటు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)కి సంబంధించి అభ్యర్థులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 95056 19127, 97056 55349 నంబర్లలో సంప్రదించవచ్చని మంత్రి బొత్స తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 122 పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు విడతలుగా కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించనున్నామన్నారు. ఏపీపీఎస్సీ పరీక్ష జరిగే మార్చి 17న డీఎస్సీ ఉండదని తెలిపారు.


ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష

* ప్రిన్సిపల్‌, పీజీటీ, టీజీటీ అభ్యర్థులకు పేపర్‌-1గా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 50 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్‌-2ను లెక్కిస్తారు. ప్రిన్సిపల్‌ అభ్యర్థులకు గతంలో పని చేసిన అనుభవం తప్పనిసరి.

* ప్రిన్సిపల్‌, పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ), వ్యాయామ డైరెక్టర్‌ పోస్టులకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ), స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ), సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) వెయిటేజీ 20 శాతం ఉంటుంది. ఈ మేరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)కి సంబంధించి ప్రభుత్వం ఫిబ్రవరి 12న రెండు జీఓలు జారీ చేసింది.

* ఎంకామ్‌లో అప్లైడ్‌, బిజినెస్‌ ఎకనామిక్స్‌ విద్యార్హత ఉన్నవారు పీజీ పోస్టులకు అనర్హులు.

* ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారు అర్హులు. ఓసీలకు 2024 జులై 1 నాటికి 44 ఏళ్లు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వారికి 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు గరిష్ఠ వయోపరిమితిగా నిర్ణయించారు.
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష 2.30 గంటలపాటు ఉంటుంది.





  డీఎస్సీ ఆంధ్రప్రదేశ్   


  స్కూల్ అసిస్టెంట్  
 

తెలుగు (కంటెంట్)
హిందీ (కంటెంట్)
ఇంగ్లిష్ (కంటెంట్)
బయాలజీ (కంటెంట్)
ఫిజికల్ సైన్సెస్ (కంటెంట్)
సోషల్ స్టడీస్ (కంటెంట్)
విద్యా దృక్పథాలు (కంటెంట్)
 సైకాలజీ (కంటెంట్)

  తెలుగు పండిట్   

కంటెంట్
మెథడాలజీ


  సెకండరీ గ్రేడ్ టీచర్స్   

లాంగ్వేజ్ - I తెలుగు (కంటెంట్)
గణితం (మెథడాలజీ)
సోషల్ స్టడీస్ (కంటెంట్)
 సైన్స్ (కంటెంట్)
 విద్యా దృక్పథాలు
సైకాలజీ (కంటెంట్)

లాంగ్వేజ్ - II ఇంగ్లిష్ (కంటెంట్)

లాంగ్వేజ్ - I హిందీ (కంటెంట్)
 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.