* ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఎగ్జామ్స్
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్టికెట్లు సోమవారం (ఫిబ్రవరి 19) విడుదలకానున్నాయి. టీఎస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో హాల్టికెట్లు పొందుపరుచనున్నారు. వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి. పరీక్షల కోసం ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్ష తేదీలివే..
ఫిబ్రవరి 28 - పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజి పేపర్-1)
మార్చి 1 - పార్ట్ 1 (ఇంగ్లిష్ పేపర్-1)
మార్చి 4 - పార్ట్ 3 (మేథమేటిక్స్ పేపర్-1ఏ, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1)
మార్చి 6 - మేథమేటిక్స్ పేపర్ 1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
మార్చి 11- ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
మార్చి 13 - కెమెస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
మార్చి 15 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-1 (ఫర్ బైపీసీ స్టూడెంట్స్)
మార్చి 18 - మోడరన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష తేదీలివే..
ఫిబ్రవరి 29 - పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2)
మార్చి 2 - పార్ట్ 1 (ఇంగ్లీష్ పేపర్-2)
మార్చి 5 - పార్ట్ 3 (మేథమేటిక్స్ పేపర్ 2ఏ, బోటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2)
మార్చి 7 - మేథమేటిక్స్ పేపర్ 2బి, జూవాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
మార్చి 12 - ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
మార్చి 14 - కెమెస్ట్రీ పేపర్ -2, కామర్స్ పేపర్-2
మార్చి 16 - పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-2 (ఫర్ బైపీసీ స్టూడెంట్స్)
మార్చి 19 - మోడరన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.