• facebook
  • whatsapp
  • telegram

RAM: రామోజీ అకాడమీ ఉచిత ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సులు

* 8 భాషల్లో శిక్షణ

రామోజీ గ్రూపు సంస్థలకు చెందిన రామోజీ అకాడమీ ఆఫ్‌ మూవీస్‌(ఆర్‌ఏఎం) తెలుగులో ఉచిత ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సులను అందించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కోర్సులను ఆన్‌లైన్‌ ద్వారా అందించనున్నారు. ఇందులో భాగంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, యాక్షన్‌, ఫిల్మ్‌ ప్రొడక్షన్‌, ఫిల్మ్‌ ఎడిటింగ్‌, డిజిటల్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ లాంటి కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కనీస వయసు 15 సంవత్సరాలు, ఎంచుకున్న భాషలో నైపుణ్యం కలిగి ఉన్నవారు ఈ కోర్సులకు అర్హులు. సేఫ్‌ ఎగ్జామ్‌ బ్రౌజర్‌ (ఎస్‌ఈబీ) ద్వారా సురక్షితమైన దశలవారీగా అధ్యయనం చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ బ్రౌజర్‌లో కోర్సుకు సంబంధించి సబ్జెక్టుల గురించి పూర్తి విషయాలు ఉంటాయి.  తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్‌, తమిళ, మలయాళ, మరాఠీ, కన్నడ, బెంగాలీ భాషల్లోనూ ఈ కోర్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఆసక్తి కల విద్యార్థులు మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 


  రామోజీ అకాడమీ ఆఫ్‌ మూవీస్‌ వెబ్‌సైట్‌
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.