ఆమడగూరు: పదో తరగతి పరీక్షల్లో భాగంగా ఏప్రిల్ 29న ఇంగ్లిష్ పరీక్ష జరుగుతోంది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే (ఉదయం 10గంటలకు) ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగూరు పాఠశాల నుంచి పదో తరగతి ఇంగ్లిష్ పేపర్ లీకైనట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.
పరీక్షల మొదటిరోజు తెలుగు ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమవగా.. రెండోరోజు హిందీ ప్రశ్నపత్రం బయటకు రావడం గమనార్హం. స్థానిక అధికారులు మాత్రం తమ వద్ద లీక్ కాలేదంటూ వివరణలు ఇచ్చిన విషయం తెలిసిందే.
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.