• facebook
  • whatsapp
  • telegram

పాలిసెట్‌లో మిగిలిన సీట్లు

48 శాతమే భర్తీ 
మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తి

ఈనాడు, అమరావతి: ఏపీ పాలిసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో 48.07 శాతం సీట్లే భర్తీ అయ్యాయి. కేటాయింపు వివరాలను కన్వీనర్‌ ఎం.ఎం.నాయక్‌ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటులో కలిపి 72,713 సీట్లు ఉండగా 34,956 మాత్రమే నిండాయి. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, అందరినీ ఉత్తీర్ణులు చేసినందున సీట్ల భర్తీ పెరుగుతుందని భావించగా.. ఈసారి గతేడాది కంటే సీట్ల భర్తీ తగ్గడం విశేషం. క్రీడా ధ్రువపత్రాల పరిశీలన పూర్తికానందున ఈ కోటా కింద 326 మందికి సీట్ల కేటాయింపును వాయిదా వేశారు. గతేడాది 55.37 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ప్రైవేటు కళాశాలల్లో ప్రతిసారీ సగమైనా నిండటం లేదు. 
భర్తీ ఇలా..
‣ పాలిసెట్‌లో అర్హత సాధించిన వారు: 60,780
కౌన్సెలింగ్‌కు నమోదు చేసుకున్న వారు: 38,542
ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు: 38,131
సీట్ల కోసం ఐచ్ఛికాలు ఇచ్చినవారు: 37,466

యాజమాన్యం         కళాశాలల సంఖ్య       కన్వీనర్‌ సీట్లు           భర్తీ
ప్రభుత్వ               84                 17,078             14,223
ఎయిడెడ్‌               2                   269               267
ప్రైవేటు                 184                 54,744             20,444
ప్రైవేటు వొకేషనల్‌         6                   622               22
మొత్తం               276                   72,713             34,956

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.