* హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియేట్ విద్యార్థుల ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియను నవంబరు 10 వరకు నిలుపుదల చేస్తూ నవంబరు 2న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కౌంటర్లు దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్ బోర్ట్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణ ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. జూనియర్ ఇంటర్లో ఆన్లైన్ విధానం ద్వారా ప్రవేశాలు కల్పించేందుకు చట్టం అనుమతించనప్పటికీ అందుకు భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ సెంట్రల్ ఆంధ్ర జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు కొల్లి బ్రహ్మయ్య మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.