• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Inspiration story: బిజినెస్‌ మ్యాగజైన్‌తో రూ.60 కోట్ల టర్నోవర్‌

ఇంజినీరింగ్‌ విద్యార్థి నీలేశ్‌ విజయగాథ


ఈటీవీ భారత్‌: దృఢ సంకల్పానికి కృషి కూడా తోడైతే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు మహారాష్ట్రకు చెందిన నీలేశ్‌ సాబే. అకోలా జిల్లాకు చెందిన నీలేశ్‌ను తల్లిదండ్రులు రెండెకరాల భూమి తాకట్టు పెట్టి ఇంజినీరింగు చదివించారు. ఐటీ విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకున్న నీలేశ్‌ రూ.12 వేల జీతానికి పుణెలోని ఓ కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. తాకట్టులో ఉన్న పొలాన్ని విడిపిస్తాడని ఆశించిన తల్లిదండ్రులు మూడు నెలల్లోనే ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చిన నీలేశ్‌ను చూసి విస్తుపోయారు. వ్యాపారం చేయాలనుకొంటున్న కుమారుణ్ని మొదట వారించినా.. తర్వాత అండగా నిలిచారు.


  ‘స్విఫ్ట్‌ ఎన్‌ లిఫ్ట్‌’ పేరుతో బిజినెస్‌ మ్యాగజైన్‌ ప్రారంభించిన నీలేశ్‌ అందులో దేశ, విదేశాల్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తల విజయగాథలను అందించాడు. విజయవంతమైన వ్యాపారవేత్తలు చెప్పే చిట్కాలను పొందుపరిచాడు. దీంతో మ్యాగజైన్‌ ఆర్థికంగా విజయం సాధించింది. ప్రస్తుతం ఏడాదికి రూ.60 కోట్ల టర్నోవరుతో దాదాపు 500 మంది యువతకు నీలేశ్‌ ఉపాధి కల్పిస్తున్నాడు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ నేర్చుకుంటే.. నెగ్గుకురాగలం!

‣ ఐటీబీపీలో పోలీసు కొలువులు!

‣ రాత పరీక్ష లేకుండా కొలువు!

‣ వాలంటరీ వర్క్‌తో ఐటీ ఉద్యోగానికి తోవ!

‣ పొరపాట్లు దిద్దుకుంటే.. పక్కా గెలుపు!

‣ రోజుకో గంట చదివితే... రూ.34లక్షల జీతం!

Posted Date : 25-07-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం