• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అసిస్టెంట్ కొలువుకు ఏఏఐ ఆహ్వానం

156 ఖాళీల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న‌

చెన్నైలోని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) సదరన్‌ రీజియన్‌లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్‌) సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 156 ఖాళీలున్నాయి.


జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఫైర్‌ సర్వీస్, అకౌంట్స్, అఫీషియల్‌ లాంగ్వేజ్‌ విభాగాల్లో కలిపి 142 ఖాళీలు ఉన్నాయి. ఫైర్‌ సర్వీస్‌ విభాగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు పదో తరగతితోపాటు మెకానికల్‌/ ఆటోమొబైల్‌/ ఫైర్‌లో మూడేళ్ల రెగ్యులర్‌ డిప్లొమా పాసవ్వాలి. లేదా ఇంటర్‌ 50 శాతం మార్కులతో పాసవ్వాలి. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి.   


‣ ఫైర్‌ సర్వీసెస్‌ విభాగంలో అభ్యర్థులకు మొదటి దశలో కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. కాలవ్యవధి 2 గంటలు. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. అన్‌రిజర్వుడ్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు 50. ఎస్సీ అభ్యర్థులు 40 మార్కులు సాధించాలి. ఈ పరీక్షలో విద్యార్హతకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి 50 శాతం ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ నాలెడ్జ్, జనరల్‌ ఇంటెలిజెన్స్, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ ఇంగ్లిష్‌ నుంచి 50 శాతం ప్రశ్నలు వస్తాయి. 


 ఆన్‌లైన్‌ రాత పరీక్ష పాసైన అభ్యర్థులను డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, వైద్య, డ్రైవింగ్‌ పరీక్షలకు ఎంపికచేస్తారు. డ్రైవింగ్‌ పరీక్షలో పాసైనవాళ్లు మాత్రమే ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌కు ఎంపికవుతారు. 


 ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌లో భాగంగా 100 మీ. రన్నింగ్, రోప్‌ క్లైంబింగ్, పోల్‌ క్లైంబింగ్, హ్యూమన్‌ డమ్మీతో 60 మీ. రన్నింగ్, లాడర్‌ క్లైంబింగ్‌ ఉంటాయి. ప్రతి టెస్ట్‌కూ 20 మార్కులు ఉంటాయి. పీఈటీలో పురుష, మహిళా అభ్యర్థులు 60 మార్కులు సాధించాలి. ప్రాథమిక శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు నెలకు రూ.25,000 స్టైపెండ్‌ లభిస్తుంది.


ఫిజికల్‌ ఫిట్‌నెస్‌: దృష్టి, వినికిడి, ఉచ్చారణ లోపాలు ఉండకూడదు. పురుషులు 167 సెం.మీ. ఎత్తు, 55 కేజీలకు తగ్గకుండా బరువు ఉండాలి. ఛాతీ 81 సెం.మీ. ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి. మహిళలు 157 సెం.మీ. ఎత్తు, 45 కేజీలకు తగ్గకుండా బరువు ఉండాలి. 


 ఆఫీసు విభాగానికి దరఖాస్తు చేసే జూనియర్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులు డిగ్రీ పాసై ఇంగ్లిష్‌ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాలను, హిందీలో అయితే 25 పదాలను టైప్‌ చేయగలగాలి. వీరిని కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. ఈ పరీక్ష 2 గంటల వ్యవధిలో 100 మార్కులకు ఉంటుంది. 50 శాతం సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్, జనరల్‌ ఇంటెలిజెన్స్, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ ఇంగ్లిష్‌ నుంచి 50 శాతం ప్రశ్నలు వస్తాయి. 


 సీనియర్‌ అసిస్టెంట్‌ 


ఈ పోస్టుకు అఫిషియల్‌ లాంగ్వేజ్‌ విభాగంలో 1 ఖాళీ, అకౌంట్స్‌ విభాగంలో 13 ఖాళీలు ఉన్నాయి. అకౌంట్స్‌ విభాగంలో దరఖాస్తు చేసే అభ్యర్థులు బీకాం చదివి, మూడు నుంచి ఆరునెలల వ్యవధి ఉన్న కంప్యూటర్‌ ట్రైనింగ్‌ కోర్సు పూర్తిచేయాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి. వీరిని కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. ఇది 100 మార్కులకు 2 గంటల వ్యవధిలో ఉంటుంది. సంబంధిత సబ్జెక్టుల నుంచి 70 శాతం ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్, జనరల్‌ ఇంటెలిజెన్స్, జనరల్‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌ నుంచి 30 శాతం ప్రశ్నలు వస్తాయి. యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులు 50, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 40 మార్కులు సాధించాలి.


 అఫిషియల్‌ లాంగ్వేజ్‌ విభాగానికి దరఖాస్తుచేసేవారు హిందీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసి, గ్రాడ్యుయేషన్‌లో ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా చదవాలి. లేదా ఇంగ్లిష్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసి డిగ్రీలో హిందీ ఒక సబ్జెక్టుగా చదవాలి/ ఏదైనా సబ్జెక్టులో మాస్టర్స్‌ చేసి, గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో హిందీ, ఇంగ్లిష్‌ ఆప్షనల్‌ సబ్జెక్టులుగా చదవాలి. హిందీ టైపింగ్‌ తెలిసినవాళ్లకు ప్రాధాన్యం ఉంటుంది. రెండేళ్ల పని అనుభవం ఉండాలి. 


 కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష 2 గంటల వ్యవధిలో 100 మార్కులకు ఉంటుంది. సంబంధిత సబ్జెక్టుల నుంచి 50 శాతం ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్, జనరల్‌ ఇంటెలిజెన్స్, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ ఇంగ్లిష్‌ నుంచి 50 శాతం ప్రశ్నలు వస్తాయి. 


వయసు: 25.08.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా గరిష్ఠ వయసులో మినహాయింపులు వర్తిస్తాయి.


వేతనం: జూనియర్‌ అసిస్టెంట్‌లకు మూలవేతనం రూ.31,000. హెచ్‌ఆర్‌ఏ, డీఏ, ఇతర అలవెన్సులన్నీ కలిపి రూ.యాభై వేలకు పైగా అందుకోవచ్చు. సీనియర్‌ అసిస్టెంట్‌లకు మూలవేతనం రూ.36,000. హెచ్‌ఆర్‌ఏ, డీఏ, ఇతర అలవెన్సులన్నీ కలిపి సుమారు రూ.అరవై వేలు వేతనంగా అందుకోవచ్చు. 


దరఖాస్తు ఫీజు: రూ.1000 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/ పీడబ్ల్యూ డీ/ ఏఏఐలో ఏడాదిపాటు అప్రంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ పూర్తిచేసినవారు ఫీజు చెల్లించనవసరం లేదు.  


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30.09.2022


ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: వెబ్‌సైట్‌లో తెలియజేస్తారు


వెబ్‌సైట్‌: www.aai.aero/

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సీఎస్ఈ, ఐటీల్లో ఏది ఎంచుకోవాలి?

‣ ఐఎన్‌సీఓఐఎస్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు

‣ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి ఎన్‌మాట్‌ మార్గం!

‣ ఫార్మా నిపుణులకు తరగని డిమాండ్‌!

‣ ప్రసిద్ధ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ పీజీ!

‣ వదిలేయడాన్ని వదిలేయండి!

Posted Date : 05-09-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌