• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో 342 ఉద్యోగాలు

అర్హత: డిగ్రీ, బీఈ, బీటెక్‌



మినీరత్న కేటగిరీ-1కు చెందిన ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ, ఇంజినీరింగ్‌ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  


మొత్తం 342 పోస్టుల్లో.. జూనియర్‌ అసిస్టెంట్‌ (ఆఫీస్‌) పోస్టులు-09, సీనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌)-09, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (కామన్‌ కేడర్‌)-237, ఫైనాన్స్‌-66, ఫైర్‌ సర్వీసెస్‌-03, లా-18 ఉన్నాయి. వీటిల్లో అన్‌రిజర్వుడ్‌కు 154, ఈడబ్ల్యూఎస్‌కు 30, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు 88, ఎస్సీకి 48, ఎస్టీకి 22 కేటాయించారు. 


1) జూనియర్‌ అసిస్టెంట్‌ (ఆఫీస్‌): డిగ్రీ పాసవ్వాలి. 

2) సీనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌): బీకామ్‌ పాసై రెండేళ్ల అనుభవం ఉండాలి. ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్, టాక్సేషన్‌ (డైరెక్ట్‌-ఇన్‌డైరెక్ట్‌), ఆడిట్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ సంబంధిత అనుభవం ఉండాలి. 

3) జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (కామన్‌ క్యాడర్‌): ఏదైనా డిగ్రీ పాసవ్వాలి. 

4) జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఫైనాన్స్‌): బీకామ్‌తోపాటు రెండేళ్ల ఐసీడబ్ల్యూఏ/ సీఏ/ ఎంబీఏ పాసవ్వాలి. 

5) జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఫైర్‌ సర్వీసెస్‌): ఇంజినీరింగ్‌ డిగ్రీ/ బీటెక్‌ ఇన్‌ ఫైర్‌ ఇంజినీరింగ్‌/మెకానికల్‌ ఇంజినీరింగ్‌ /ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ పాసవ్వాలి. 

6) జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (లా): మూడేళ్ల లా డిగ్రీ లేదా ఇంటర్‌ తర్వాత ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ రెగ్యులర్‌ కోర్సు పూర్తిచేయాలి. బార్‌ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా పేరు నమోదు చేసుకోవాలి.  


04.09.2023 నాటికి సీనియర్‌/ జూనియర్‌ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌కు 27 ఏళ్లు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులు, ఏఏఐ ఉద్యోగులకు పదేళ్లు, ఎక్స్‌ - సర్వీస్‌మెన్‌లకు అప్పటి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.1000 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు/ఏఏఐలో ఏడాది అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ పూర్తిచేసినవారు/ మహిళా అభ్యర్థులు  ఫీజు చెల్లించనవసరం లేదు. 


దరఖాస్తుల ప్రారంభం: 05.08.2023                             

దరఖాస్తుకు చివరి తేదీ: 04.09.2023                                         

వెబ్‌సైట్‌: https://www.aai.aero/


ఎంపిక

పోస్టును బట్టి కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్, ఫిజికల్‌ మెజర్‌మెంట్, ఎండ్యూరెన్స్‌ టెస్ట్, డ్రైవింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తులో తెలిపిన వివరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేసి ఆన్‌లైన్‌ టెస్ట్‌కు అడ్మిట్‌ కార్డ్‌లను జారీచేస్తారు. 

అన్ని పోస్టులకూ ఆబ్జెక్టివ్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) నిర్వహిస్తారు. ఇది హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది.

సీబీటీ ప్రశ్నపత్రంలో 120 ప్రశ్నలకు 120 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 20 ప్రశ్నలు (20 మార్కులు), జనరల్‌ ఇంటెలిజెన్స్‌/ రీజనింగ్‌ 15 ప్రశ్నలు (15 మార్కులు), జనరల్‌ ఆప్టిట్యూడ్‌/ న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ 15 ప్రశ్నలు (15 మార్కులు), జనరల్‌ నాలెడ్జ్‌/ అవేర్‌నెస్‌ 10 ప్రశ్నలు (10 మార్కులు), మేథమెటిక్స్, ఫిజిక్స్‌ 60 ప్రశ్నలు (60 మార్కులు). వ్యవధి 2 గంటలు. 

ఆన్‌లైన్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ను తయారుచేస్తారు. పోస్టును అనుసరించి అప్లికేషన్‌ వెరిఫికేషన్‌/ కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌/ ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ అండ్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌/ డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. షార్ట్‌లిస్టులోని అభ్యర్థుల రోల్‌నంబర్లను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి కాల్‌లెటర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 

జూనియర్‌ అసిస్టెంట్‌ (ఆఫీస్‌), సీనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌) పోస్టులకు ఆన్‌లైన్‌ టెస్ట్‌లో పాసైన తర్వాత అప్లికేషన్‌ వెరిఫికేషన్, కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌ నిర్వహిస్తారు. దీంట్లో అర్హత సాధించిన అభ్యర్థులను ఎంపికచేస్తారు. 

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఫైర్‌ సర్వీసెస్‌) పోస్టుకు ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ తర్వాత అప్లికేషన్‌ వెరిఫికేషన్, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. దీంట్లో భాగంగా.. రన్నింగ్, పోల్, లేడర్, రోప్‌ క్లైంబింగ్, డ్రైవింగ్‌ టెస్ట్‌లు ఉంటాయి. వీటిల్లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (గ్రూప్‌-బి) పే స్కేల్‌ రూ.40,000-1,40,000, సీనియర్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌-సి) 36,000-1,10,000, జూనియర్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌-సి) రూ.31,000-92,000 ఉంటుంది. బేసిక్‌ పేతోపాటు డియర్‌నెస్‌ అలవెన్స్, పెర్క్స్, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలూ ఉంటాయి. వీటితోపాటుగా సోషల్‌ సెక్యూరిటీ స్కీమ్స్, మెడికల్‌ బెనిఫిట్స్‌ ఉంటాయి. 


సన్నద్ధత ఎలా?

సిలబస్, పరీక్ష విధానం ఏఏఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. వీటి గురించి ముందుగా అవగాహన పెంచుకుంటే సన్నద్ధత సులువుతుంది. పరీక్షలో ఏయే అంశాల నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయో, ఎలా ఉండబోతోందోననే ఆందోళనా ఉండదు. 

తప్పు సమాధానాలకు నెగెటివ్‌ మార్కులు లేవు. కాబట్టి తెలియని వాటిని వదిలేయనవసరం లేదు. చివర్లో కాస్త సమయం తీసుకుని ప్రయత్నించి సమాధానాలను గుర్తించవచ్చు. 

పాత ప్రశ్నపత్రాలను ఎక్కువగా సాధన చేయడం వల్ల వ్యవధి లోపలే సమాధానాలు రాయడానికి క్రమంగా అలవాటుపడతారు. 

ఏయే అంశాల్లో మెరుగ్గా ఉన్నారో.. వేటిల్లో వెనకబడి ఉన్నారో స్పష్టంగా తెలుస్తుంది. దాంతో బలాలు, బలహీనతలను సమీక్షించుకుని అందుకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. 

సబ్జెక్టులవారీగా సమయాన్ని విభజించుకోవాలి. ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉన్న సబ్జెక్టుకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే ఫలితం ఉంటుంది. 

పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు. వేచిచూడకుండా ఇప్పటినుంచే సన్నద్ధతను మొదలుపెట్టటం మేలు. 

సొంతంగా నోట్స్‌ రాయడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యాంశాలను సబ్జెక్టులవారీగా రాసుకోవడం వల్ల పరీక్ష ముందు వాటిని ఒకసారి రివిజన్‌ చేసుకుంటే సరిపోతుంది. 


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ కెరియర్‌ కౌన్సెలింగ్‌కు ఉచిత సలహాలివిగో..

‣ కోర్సు ఎంపికకు.. కౌన్సెలింగ్‌ ముఖ్యం

‣ భాషలపై పట్టు.. అవకాశాలు మెండు

‣ అగ్నివీరులకు వాయుసేన ఆహ్వానం

‣ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి ఉత్తమ మార్గం

‣ ఉపాధి అవకాశాల ‘ఆప్టోమెట్రీ’

‣ ఎన్‌ఐఓహెచ్‌లో టెక్నికల్‌ క్యాడర్‌ పోస్టులు

‣ సూపర్‌ కెరియర్‌.. ‘సైబర్‌ సెక్యూరిటీ’

Posted Date : 26-07-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌