• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అణుశక్తి విభాగంలో కొలువులు

అణుశక్తి విభాగానికి చెందిన అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రిసెర్చ్‌లో ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా ఉన్న డీఏఈ యూనిట్లు/ కేంద్రాల్లో పోస్టుల భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు! 

జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌ (జేటీవో) పోస్టులు 9 ఉన్నాయి. వీటిల్లో ఓబీసీలకు 2, ఈడబ్ల్యూఎస్‌లకు 2, అన్‌రిజర్వుడ్‌కు 5 కేటాయించారు. ఈ పోస్టుకు హిందీ/ ఇంగ్లిష్‌ సబ్జెక్టులో పీజీ చేసి ఉండాలి. డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్‌/హిందీని ప్రధాన సబ్జెక్టుగా చదివాలి. లేదా ఏదైనా సబ్జెక్టుతో పీజీ చదివి, డిగ్రీలో స్థాయిలో హిందీ, ఇంగ్లిష్‌లను మెయిన్‌ సబ్జెక్టులుగా చదవాలి లేదా ఏదైనా సబ్జెక్టుతో పీజీని హిందీ/ఇంగ్లిష్‌ మీడియంలో పూర్తిచేయాలి. 

అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (ఏఎస్‌వో) పోస్టులు 38  ఉన్నాయి. వీటిల్లో ఎస్సీలకు 3, ఎస్టీలకు 3, ఓబీసీలకు 14, ఈడబ్ల్యూఎస్‌లకు 3, అన్‌రిజర్వుడ్‌కు 15 కేటాయించారు. ఈ పోస్టుకు డిగ్రీ పాసవ్వాలి.  

సెక్యూరిటీ గార్డు పోస్టులు 274 ఉన్నాయి. వీటిల్లో ఎస్సీలకు 20, ఎస్టీలకు 28, ఓబీసీలకు 46, ఈడబ్ల్యూఎస్‌లకు 18, అన్‌రిజర్వుడ్‌కు 162 కేటాయించారు. ఈ పోస్టుకు పదో తరగతి పాసవ్వాలి. 

వయసు: జేటీవో పోస్టులకు 18-28 ఏళ్లు, మిగిలిన వాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను లెవల్‌-1 (రాత పరీక్ష), లెవల్‌-2 (డిస్క్రిప్టివ్‌ రాత పరీక్ష), ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెక్యూరిటీ గార్డు పోస్టులకు రూ.18,000, మిగిలిన ఖాళీలకు రూ.35,400 మూలవేతనం చెల్లిస్తారు. 

జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌ (జేటీవో) 

లెవల్‌-1 పరీక్ష: ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. దీంట్లో నాలుగు విభాగాలుంటాయి. 

1. జనరల్‌ హిందీ 

2. జనరల్‌ ఇంగ్లిష్‌ 

3. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 

4. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌

మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. ఈ పరీక్షలో అన్‌రిజర్వ్‌డ్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఓబీసీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి. అభ్యర్థులను 1:20 నిష్పత్తిలో లెవల్‌-2 పరీక్షకు ఎంపిక చేస్తారు. 

లెవల్‌-2 పరీక్ష: డిస్క్రిప్టివ్‌ రాత పరీక్షలో పేపర్‌-1, పేపర్‌-2 ఉంటాయి. పేపర్‌-1కు 100 మార్కులు. పరీక్ష సమయం 3 గంటలు. 

దీంట్లో 250 పదాలున్న రెండు పేరాగ్రాఫ్‌లను హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించాలి. ఒకపేరా టెక్నికల్, మరోటి అడ్మినిస్ట్రేటివ్‌ విషయాలకు సంబంధించినదై ఉంటుంది. దీనికి 25 మార్కులు ఉంటాయి. అలాగే 250 పదాలున్న రెండు పేరాలను ఇంగ్లిష్‌ నుంచి హిందీలోకి అనువదించాలి. ఒకపేరా టెక్నికల్, మరోటి అడ్మినిస్ట్రేటివ్‌ విషయాలకు సంబంధించినదై ఉంటుంది. దీనికి 25 మార్కులు ఇస్తారు. హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి 10 వాక్యాలను అనువదించాలి. వీటికి 15 మార్కులు. ఇంగ్లిష్‌ నుంచి హిందీలోకి 10 వాక్యాలను అనువదించాలి. వీటికి 15 మార్కులు. 10 ఇంగ్లిష్‌ పదాలకు హిందీలో పర్యాయ పదాలు రాయాలి. వీటికి 10 మార్కులు. 10 హిందీ పదాలకు ఇంగ్లిష్‌లో పర్యాయ పదాలు రాయాలి. వీటికి 10 మార్కులు ఉంటాయి. 

పేపర్‌-2: ఈ పరీక్షకు 100 మార్కులు. కాలవ్యవధి 3 గంటలు. జనరల్‌ ఇంటెలిజెన్స్, రీజనింగ్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు 50 మార్కులు, జనరల్‌ హిందీకి 15 మార్కులు, జనరల్‌ ఇంగ్లిష్‌కు 15 మార్కులు, హిందీలో వ్యాసానికి 10 మార్కులు, ఇంగ్లిష్‌లో వ్యాసానికి 10 మార్కులు ఉంటాయి. అభ్యర్థుల తుది ఎంపిక లెవల్‌-2లో పొందిన మార్కుల ఆధారంగానే ఉంటుంది.  

అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ 

అభ్యర్థుల ఎంపిక భౌతిక, రాత పరీక్షల ఆధారంగా ఉంటుంది. 

రాత పరీక్ష: ఆబ్జెక్టివ్‌ విధానంలో ఈ పరీక్ష 75 మార్కులకు ఉంటుంది. కాలవ్యవధి 90 నిమిషాలు. దీంట్లో 3 విభాగాలు ఉంటాయి. 

ఎ) కాంప్రహెన్షన్‌కు 25 మార్కులు 

బి) రిపోర్ట్‌ రైటింగ్‌కు 25 మార్కులు 

సి) ఎనలిటికల్‌ (బేసిక్‌ మ్యాథ్స్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌)కు 25 మార్కులు ఉంటాయి. 

సెక్యూరిటీ గార్డ్‌  

అభ్యర్థులను ఫిజికల్‌ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. 

రాత పరీక్ష: 75 మార్కుల ఈ పరీక్షను 90 నిమిషాల్లో పూర్తిచేయాలి. దీంట్లో 3 విభాగాలుంటాయి. కాంప్రహెన్షన్‌కు 25 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ (ఆబ్జెక్టివ్‌ టైప్‌)కు 25 మార్కులు, ఎనలిటికల్‌ లేదా బేసిక్‌ మ్యాథమెటిక్స్‌ (ఆబ్జెక్టివ్‌ టైప్‌)కు 25 మార్కులు ఉంటాయి. అభ్యర్థుల తుది ఎంపిక రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే ఉంటుంది. 

గుర్తుంచుకోవాల్సినవి 

ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. హార్డ్‌కాపీలను పంపాల్సిన పని లేదు. 

జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టులకు రూ.200. సెక్యూరిటీ గార్డ్‌ పోస్టుకు రూ.100 ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది)

ఫిజికల్‌/ రిటెన్‌ టెస్ట్‌ తేదీ, సమయాలను అభ్యర్థులకు ఈ-మెయిల్‌/ ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తారు. కాబట్టి ఈ-మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నంబర్‌ను సరిగా రాయాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17.11.2022

ఏఎస్‌వో-ఎ, సెక్యూరిటీ గార్డ్‌ పోస్టుల ఫిజికల్‌ టెస్ట్‌ తేదీలు: డిసెంబరు, 2022

జేటీవో (లెవల్‌-1), సెక్యూరిటీ గార్డ్‌ పోస్టుల రాత పరీక్ష (కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష) తేదీలు: జనవరి 2023

జేటీవో (లెవల్‌-2), ఏఎస్‌వో డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ తేదీ: ఫిబ్రవరి, 2023 

ఏపీ, తెలంగాణల్లో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్‌

వెబ్‌సైట్‌: https://www.amd.gov.in/app16/index.aspx
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫారిన్‌ ట్రేడ్‌.. అద్భుత కెరియర్‌!

‣ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేక అధికారులు

‣ ఆవిష్కరణల అధ్యయనానికీ కోర్సులు!

‣ కుదిరిన వేళల్లో కాస్త సంపాదించుకుంటారా?

‣ కాపీ కొట్టాలని ఎందుకు అనిపిస్తుందంటే?

Posted Date : 07-11-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌