• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీసీఎంబీలో ఉద్యోగావకాశాలు

‣ టెక్నీషియన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌ - సీసీఎంబీ (సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ) టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ట్రేడ్‌ టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ఈ పోస్టులకు పోటీపడాలంటే సైన్స్‌ సబ్జెక్టుతో ఎస్‌ఎస్సీ/ పదో తరగతి 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ఐటీఐ పాసవ్వాలి. ల్యాబొరేటరీ యానిమల్‌ ఫెసిలిటీ/ యానిమల్‌ హౌస్‌ (ల్యాబ్‌ యానిమల్‌ హ్యాండ్లింగ్‌/ బ్రీడింగ్‌)లో 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.


దరఖాస్తు రుసుము రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు.


మొత్తం 40 ఉద్యోగాల్లో అన్‌రిజర్వుడ్‌కు 18, ఈడబ్ల్యూఎస్‌లకు 02, ఓబీసీలకు 10, ఎస్సీలకు 07, ఎస్టీలకు 03 కేటాయించారు.


యానిమల్‌ హౌస్‌, క్యాంటీన్‌, గెస్ట్‌హౌస్‌, ఫార్మసిస్ట్‌, ఎల్‌టీఎస్‌, ఐటీ లెకోన్స్‌, ఆర్‌ అండ్‌ ఏసీ, ప్లంబర్‌, మేసన్రీ, కార్పెంటరీ, ల్యాబొరేటరీ, ట్రాన్స్‌పోర్ట్‌ మొదలైన విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.


20.01.2024 నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు తాజా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మినహాయింపు ఉంటుంది.


ఎంపిక: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. స్టేజ్‌-1లో ట్రేడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. సంబంధిత సబ్జెక్టులో అభ్యర్థికి ఉండే పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు.


స్టేజ్‌-2లో

రాత పరీక్ష ఓఎంఆర్‌/ కంప్యూటర్‌ ఆధారిత ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. ప్రశ్నలు హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటాయి. ఇవి ఎస్‌ఎస్‌సీ/ ఐటీఐ/ పన్నెండో తరగతి స్థాయిలో ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటల 30 నిమిషాలు.

‣ పేపర్‌-1: మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌ 50 ప్రశ్నలు - 100 మార్కులు. ప్రతి సరైన సమాధానానికీ 2 మార్కులు. నెగెటివ్‌ మార్కులు లేవు. వ్యవధి 1 గంట. మెంటల్‌ ఎబిలిటీలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, సిట్యుయేషనల్‌ జడ్జిమెంట్‌ మొదలైనవి ఉంటాయి.

‣ పేపర్‌-2: జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు - 75 మార్కులు. సరైన సమాధానానికి 3 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికీ 1 మార్కు తగ్గిస్తారు.

‣ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు - 75 మార్కులు. సరైన సమాధానానికి 3 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు. వ్యవధి 30 నిమిషాలు.  

‣ పేపర్‌-3: సంబంధిత విభాగానికి చెందిన సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు - 150 మార్కులు. సరైన సమాధానానికి 3 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు. వ్యవధి 1 గంట.

‣ పేపర్‌-1లో కనీసార్హత మార్కులు సాధించినవారికి మాత్రమే పేపర్‌-2, పేపర్‌-3 రాసే అవకాశం కల్పిస్తారు.

‣ పేపర్‌-2, పేపర్‌-3లో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల తుది జాబితాను రూపొందిస్తారు.


సన్నద్ధత

జనరల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, సిట్యుయేషనల్‌ జడ్జిమెంట్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌.. ప్రశ్నలకు వివిధ పోటీ పరీక్షల పుస్తకాలను చదవొచ్చు.

‣ పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారా సన్నద్ధత స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవచ్చు.

‣ బలహీనంగా ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. వాటికి అదనపు సమయాన్ని కేటాయించాలి.

‣ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే టెస్ట్‌లనూ రాస్తుండాలి.

‣ ప్రశ్నలకు నిర్ణీత సమయంలోగా సమాధానాలు రాయడం సాధన చేయాలి.

‣ నెగెటివ్‌ మార్కులు ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బాగా తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి.


‣ దరఖాస్తుకు చివరి తేదీ: 20.01.2024


‣ వెబ్‌సైట్‌: https://www.ccmb.res.in/


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-12-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌