• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బీమా సంస్థలో కొలువులు

* డిగ్రీ ఫ్రెషర్స్‌కు అవకాశం 
* 300 అసిస్టెంట్‌ పోస్టులకు యూఐఐసీ నోటిఫికేషన్‌
* తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు 

ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరం 

తెలంగాణలో హైదరాబాద్‌/రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం  


యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (యూఐఐసీ) 300 అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. డిగ్రీ పాసైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, రీజనల్‌ లాంగ్వేజ్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


మొత్తం 300 ఉద్యోగాల్లో అన్‌-రిజర్వుడ్‌కు 159, ఎస్సీలకు 30, ఎస్టీలకు 26, ఓబీసీలకు 55, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 30 కేటాయించారు. 30.09.2023 నాటికి ఏదైనా డిగ్రీ పాసైనవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులకు దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసుండాలి. 

ఆంధ్రప్రదేశ్‌కు 8, తెలంగాణకు 3 పోస్టులే కేటాయించినప్పటికీ... హిందీ రాయడం, చదవడం, మాట్లాడటం తెలిసిన అభ్యర్థులు ప్రాంతీయ భాషగా హిందీ ఉన్న రాష్ట్రాల్లోని ఉద్యోగాలకు పోటీపడవచ్చు.

అభ్యర్థుల వయసు 30.09.2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో.. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు,  పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్లు, యుఐఐసీ ఉద్యోగులకు 5 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ, యూఐఐసీ ఉద్యోగులకు రూ.250 + జీఎస్టీ అదనం. ఇతరులకు రూ.1000 + జీఎస్టీ అదనం. ఎంపికైన అభ్యర్థులకు 6 నెలల ప్రొబేషన్‌ ఉంటుంది. సంస్థ అంచనాలను అభ్యర్థులు అందుకోలేకపోతే.. ప్రొబేషన్‌ కాలాన్ని పెంచుతారు. 

ఎంపిక: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, రీజనల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో.. మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. ప్రశ్నపత్రంలో 5 సెక్షన్లు ఉంటాయి. 

1. రీజనింగ్‌ - 40 ప్రశ్నలు, 50 మార్కులు

2. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ - 40 ప్రశ్నలు, 50 మార్కులు

3. న్యూమరికల్‌ ఎబిలిటీ - 40 ప్రశ్నలు, 50 మార్కులు 

4. జనరల్‌ నాలెడ్జ్‌/ జనరల్‌ అవేర్‌నెస్‌ - 40 ప్రశ్నలు, 50 మార్కులు 

5. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ - 40 ప్రశ్నలు, 50 మార్కులు 

మొత్తం 200 ప్రశ్నలకు 250 మార్కులు ఉంటాయి. 

ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. 

పరీక్ష వ్యవధి 120 నిమిషాలు (2 గంటలు).


రాత పరీక్ష పాసై, రీజనల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల తుది జాబితాను రూపొందించి .. వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వీటన్నింటిలో పాసైన అభ్యర్థులను ఎంపికచేసి.. ఈ సమాచారాన్ని వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేస్తారు. 


సన్నద్ధత

రీజనింగ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌/ జనరల్‌ అవేర్‌నెస్, కంప్యూటర్‌ నాలెడ్జ్‌... వీటి సన్నద్ధత కోసం ఐబీపీఎస్, ఎస్‌ఎస్‌సీ, రైల్వే పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయొచ్చు. 

సమాధానాలను కచ్చితంగా, నిర్ణీత సమయంలోనే రాయగలగాలి. 

నెగిటివ్‌ మార్కులు ఉన్నాయి. కాబట్టి తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలను గుర్తించాలి. తెలియనివాటిని వదిలివేయడమే మంచిది. 

‣ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే మాక్‌టెస్ట్‌లను రాయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. బలాలు, బలహీనతలను సమీక్షించుకుని.. వెనకబడిన అంశాల సాధనకు అదనపు సమయాన్ని కేటాయించుకునే వీలుంటుంది.  

బ్యాంకు పరీక్షలకు సంబంధించి మార్కెట్లో అందుబాటులో ఉన్న పుస్తకాలనూ చదవొచ్చు. 


గమనించాల్సినవి

ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రింటవుట్‌ను అభ్యర్థులు భద్రపరుచుకోవాలి. 

కాల్‌ లెటర్‌ ద్వారా పరీక్ష కేంద్రం వివరాలను తెలియజేస్తారు. దీన్ని వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈ సమాచారాన్ని ఈమెయిల్‌/ ఎస్‌ఎంఎస్‌ ద్వారా అభ్యర్థులకు తెలియజేస్తారు. 

‣ దరఖాస్తు సమయంలోనే పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఎలాంటి మార్పులకూ అవకాశం ఉండదు.


దరఖాస్తుకు చివరి తేదీ: 06.01.2024

వెబ్‌సైట్‌: http://www.uiic.co.in/
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ నౌకాదళంలో 910 సివిల్‌ కొలువులు

‣ అణుశక్తి విభాగంలో ఉద్యోగాలు

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు

‣ సివిల్స్‌ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు

‣ డిప్లొమాతో ఎన్‌టీపీసీలో అవకాశాలు

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

Posted Date : 21-12-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.