• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీడాట్‌లో 156 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

భారత టెలికాం టెక్నాలజీ సెంటర్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్‌ (సీడాట్‌).. టెలికాం టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధికి కృషిచేస్తోంది. దీంట్లో భాగంగా న్యూదిల్లీ, బెంగళూరులోని కేంద్రాల్లో 156 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ ఖాళీల భర్తీకి ప్రకటన జారీచేసింది.  

ఈ నియామకాలు ఏడాది కాలానికి మాత్రమే పరిమితం. అయితే అభ్యర్థి పనితీరును బట్టి మరో సంవత్సరంపాటు పొడిగించే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్‌లో 65 శాతం/ అంతకుమించి మార్కులు సాధించాలి. డిగ్రీ పాసైన తర్వాతా, గడువుతేదీ నాటికి సాధించిన అనుభవాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. బీఈ, బీటెక్, బీడిజైన్‌తో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు దరఖాస్తు గడువు తేదీ నాటికి 30 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌/ పీడబ్ల్యూడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లను తప్పని సరిగా అప్‌లోడ్‌ చేయాలి.  

ఎంపిక ఎలా?

ప్రాజెక్టు అవసరాలకు అనుగుణంగా ఖాళీలను ఎప్పటికప్పుడు సీడాట్‌ పోర్టల్‌ ద్వారా తెలియజేస్తారు. ఖాళీల సంఖ్య కంటే ఎక్కువగా దరఖాస్తులు వస్తే స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. విద్యార్హతలు, వయసు, సంపాదించిన మార్కులు, సాధించిన అనుభవం.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపికచేస్తారు.  

సెలక్షన్‌ కమిటీ విధానాలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లయితే.. నిర్ణీత కాలానికి కొందరిని వెయిటింగ్‌ లిస్ట్‌లో కూడా ఉంచుతారు. 

ఖాళీల కంటే దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎక్కువగా ఉన్నప్పుడు షార్ట్‌లిస్ట్‌ తయారుచేసి.. కొందరిని మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు.  

కన్సాలిడేటెడ్‌ రెమ్యూనరేషన్‌ కింద అన్నీ కలిపి నెలకు రూ.లక్ష వేతనం చెల్లిస్తారు. ఇతర ప్రోత్సాహకాలు ఏమీ ఉండవు. పీఎఫ్‌ సదుపాయం ఉంటుంది. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29.11.2023

వెబ్‌సైట్‌: https://www.cdot.in/ 
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ మీడియా సంస్థల్లో ఆహ్వానం

‣ కోల్‌ఫీల్డ్స్‌లో కొలువులు

‣ ఇస్రోలో 62 టెక్నికల్‌ ఉద్యోగాలు

‣ లాభదాయక కెరియర్‌.. బిజినెస్‌ ఇంజెలిజెన్స్‌

‣ డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

‣ అవకాశం సులువు.. అధిక మార్కెట్‌ విలువ!

Posted Date : 12-04-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌