• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పీహెచ్‌డీ ఉందా మీకు? 

జీవిత లక్ష్యాలను సాధించాలంటే పీహెచ్‌డీ ఉండాలి! అయితే ఇది మనందరికీ తెలిసిన Ph.D. కాదు! మరేమిటి? P.H.D.  


పి అంటే ప్యాషన్‌ (తీవ్ర అభిరుచి), హెచ్‌ అంటే హంగర్‌ (ఆకలి/ తపన), డి అంటే డిసిప్లిన్‌ (క్రమశిక్షణ).


ప్యాషన్‌: ‘చేసే పనిని ప్రేమిస్తున్నానా.. లేదా’ అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. దీనికి సమాధానం ‘అవును’ అయితే ఇష్టంగా పనిచేయగలుగుతారు. మార్టిన్‌ లూథర్‌కింగ్‌ ఇదే విషయాన్ని వివరిస్తూ.. ‘ఒక స్వీపర్‌ రోడ్లను ఊడిస్తే.. మైకెలేంజిలో పెయింటింగ్‌లా.. షేక్‌స్పియర్‌ కవిత్వంలా గొప్పగా ఉండాలి’ అంటారు. విద్యార్థులు అంతగా ఆసక్తితో చదవాలి. ఆపై ఇష్టమైన వృత్తినే ఎంచుకోవాలి. ఒకవేళ అలాకాకపోయినా చేసే పనిని ఇష్టంతో చేయాలి. 


హంగర్‌: లక్ష్య సాధన కోసం ఆకలితో ఆత్రంగా ఎదురుచూడాలి. దాన్ని అందుకోవడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. ఒకసారి ఒక యువకుడు సోక్రటీస్‌ను కలిసి తనకు జ్ఞానాన్ని బోధించమంటాడు. అప్పుడు సోక్రటీస్‌ అతడిని నదికి తీసుకెళ్లి హఠాత్తుగా అతడి తలను నీటిలో ముంచి ఉంచుతాడు. ఆ యువకుడికి ఏం జరుగుతుందో అర్థంకాక గింజుకుంటూ గాలి పీల్చుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత.. ‘తలను నీటిలో ముంచినప్పుడు దేని కోసం ప్రయత్నించావ’ని అడుగుతాడు సోక్రటీస్‌. ‘గాలి కోసం’ అని బదులిస్తాడా యువకుడు. ‘అంతే తీవ్రంగా జ్ఞానం కోసం ప్రయత్నిస్తే తప్పకుండా దొరుకుతుంది’ అని వివరిస్తాడు సోక్రటీస్‌. విద్యాభ్యాసంలోనూ, కెరియర్‌ తీర్చిదిద్దుకోవటంలోనూ అంతటి తపన అవసరం.


డిసిప్లిన్‌: సాధించాలనే తపన ఎంత ఉన్నా క్రమశిక్షణ లేకపోతే ఫలితం ఉండదు. దారి పొడవునా ఎన్నో అవరోధాలున్నా క్రమశిక్షణతో వాటిని అధిగమించగలగాలి. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన జిమ్నాస్ట్‌ని ఒక ఇంటర్వ్యూలో... ‘మీ విజయ రహస్యం ఏంట’ని అడిగారు. అప్పుడామె.. ‘ఇష్టమైనప్పుడు ఆటను సాధన చేశాను. అలాగే ఇష్టంలేనప్పుడూ సాధన ఆపకుండా కొనసాగించాను’ అని చెప్పింది. విజయానికి క్రమశిక్షణ అంటే అదీ! మనలో చాలామంది ఎప్పటి పాఠాలను అప్పుడు చదవకుండా వాయిదా వేస్తుంటారు. అలాకాకుండా చదువులో రాణించాలంటే క్రమశిక్షణతో కృషి చేయడం ఎంతో ముఖ్యం.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప‌క్కాగా ప‌రిచ‌యం! 

‣ పది పాసైతే ప్రభుత్వ ఉద్యోగాలు

‣ మెయిన్‌లో మెరిసేందుకు మ‌రో అవ‌కాశం!

‣ ప్రావీణ్యం పెంచే వృత్తి విద్య

‣ అర్థం చేసుకుంటూ చ‌దివితే..!

‣ దేశ రాజ‌ధానిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

‣ విశ్వాసం ఉంటే విలువ త‌గ్గ‌దు!

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

Posted Date : 27-07-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌