‣ 65 పర్చేజ్ అసిస్టెంట్ పోస్టులు
ముంబయిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్.. జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/ జూనియర్ స్టోర్ కీపర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ముంబయితోపాటు దేశవ్యాప్తంగా ఉన్న డీపీఎస్ యూనిట్లలో ఉద్యోగులను నియమించనున్నారు.
మొత్తం 65 పోస్టుల్లో ఎస్సీలకు 23, ఓబీసీలకు 8, ఈడబ్ల్యూఎస్‌లకు 22, అన్‌రిజర్వుడ్‌కు 12 కేటాయించారు. అభ్యర్థులు 60 శాతం మార్కులతో బీఎస్సీ/ బీకాం/ డిప్లొమా (మెకానికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్) పాసై ఉండాలి. గడువుతేదీ నాటికి సంబంధిత విద్యార్హతలు లేనివాళ్లు దరఖాస్తు చేయడానికి అనర్హులు. దరఖాస్తు రుసుము రూ.200 ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులు, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు.
అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10-15 ఏళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు 3 ఏళ్ల మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: అభ్యర్థులను రెండు దశల్లో నిర్వహించే రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. లెవెల్-1లో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, లెవెల్-2లో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. లెవెల్-1 అనేది లెవల్-2కు అర్హత పరీక్ష మాత్రమే. అభ్యర్థుల తుది ఎంపికకు లెవెల్-2లో సాధించిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. లెవెల్-2 తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు 6 నెలల శిక్షణ ఉంటుంది.
‣ లెవెల్-1, లెవెల్-2 పరీక్షలను ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ఇందౌర్, బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్, గువహటి, నాగ్‌పుర్‌లో నిర్వహిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలోనే మూడు కేంద్రాలను ఎంచుకోవాలి.
లెవెల్-1: ఇది ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో 200 మార్కులకు ఉంటుంది. దీంట్లో 5 పార్టులుంటాయి. పార్ట్-ఎలో జనరల్ ఇంగ్లిష్‌లో 50 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-బిలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇన్ సైన్స్ (బేసిక్ కాన్సెప్ట్స్ 12వ తరగతి స్థాయి) లేదా బేసిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ (12వ తరగతి స్థాయి) 60 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు సమంలోనే పార్ట్-బిలో సైన్స్ లేదా అకౌంట్స్‌లో ఒకదాన్ని ఎంపికచేసుకోవాలి. పార్ట్-సిలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (అరిథ్‌మెటిక్) 50 ప్రశ్నలు, పార్ట్-డిలో జనరల్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు, పార్ట్-ఇలో కంప్యూటర్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కులను తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. దివ్యాంగులకు 2 గంటల 40 నిమిషాల సమయం ఇస్తారు. పార్ట్-ఎలో ప్రశ్నలు ఇంగ్లిష్‌లో ఉంటాయి. పార్ట్-బి, సి, డి, ఇల్లోని ప్రశ్నలు హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటాయి. జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం కనీసార్హత మార్కులు, ఎస్సీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు 33 శాతం పొందాలి.
లెవెల్-2: దీంట్లోని రెండు పార్ట్‌లకూ కలిపి 100 మార్కులు. పార్ట్-ఎలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ - కాంప్రహెన్షన్, ప్రెస్సీ అండ్ ఇంగ్లిష్ గ్రామర్ ఉంటుంది. ఈ పార్ట్‌ను ఇంగ్లిష్‌లో మాత్రమే రాయాలి. పార్ట్-బిలో ఎస్సే, నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ ఉంటాయి. ఈ భాగాన్ని పూర్తిగా ఇంగ్లిష్ లేదా హిందీ ఏదో ఒక్క భాషలోనే రాయాలి. పరీక్ష వ్యవధి 3 గంటలు. దివ్యాంగులకు ప్రత్యేకంగా 4 గంటల సమయం కేటాయించారు. ఈ పార్ట్‌లో జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఎస్సీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు 40 శాతం సాధించాలి. లెవెల్-1, లెవెల్-2 పరీక్షలను ఒకేరోజున నిర్వహిస్తారు.
రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీంట్లో పాసైనవాళ్లను 6 నెలల శిక్షణకు ఎంపికచేస్తారు. ఈ సమయంలో ప్రతినెలా రూ.18,000 స్టైపెండ్, బుక్ అలవెన్స్ కింద ఒకేసారి రూ.3,000 చెల్లిస్తారు. శిక్షణ పూర్తినచేసినవారిని జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/ జూనియర్ స్టోర్ కీపర్‌గా నియమిస్తారు. ఎంపికైన అభ్యర్థులు మూడేళ్ల కాలానికి బాండ్ రాయాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 22.04.2023
దరఖాస్తులకు చివరి తేదీ: 15.05.2023
ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షలు: జూన్ రెండోవారంలో.
వెబ్‌సైట్: https://dpsdae.formflix.in/
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రతిష్టాత్మక ప్రమాణాలతో ఉన్నత కోర్సులు
‣ 9,231 గురుకుల కొలువులకు చదవండిలా..
‣ 18 ఎయిమ్స్ కేంద్రాల్లో 3055 నర్సింగ్ ఆఫీసర్లు
‣ ఆర్కిటెక్చర్ ప్రవేశానికి మార్గం.. నాటా