• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Education: పరీక్షల సంస్కరణపై 37వేల సూచనలు

* ఉన్నత స్థాయి కమిటీ వెల్లడి

దిల్లీ: వివిధ పోటీ పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీతో పాటు అక్రమాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆయా పరీక్షల సమర్థ నిర్వహణకు తీసుకురాదలచిన సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీకి 37వేలకు పైగా సూచనలు అందాయి. పరీక్ష పత్రాల కఠినత్వాన్ని సగటు చేసి మార్కులను నిర్ణయించే (నార్మలైజేషన్‌) విధానాన్ని రద్దు చేయడం, పరీక్షల షెడ్యూల్లో మార్పులపై ముందుగానే సమాచారం ఇవ్వడం, పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన వంటి సూచనలు, సలహాలు వాటిలో ఉన్నాయి. నీట్‌-యూజీని నిర్వహించిన జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) పనితీరును సమీక్షించే ప్రధాన ఉద్దేశంతో ఇస్రో మాజీ ఛైర్మన్‌ ఆర్‌.రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. విద్యార్థులు, తల్లిదండ్రులు, శిక్షణ సంస్థలు, పాఠశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, కెరీర్‌ కౌన్సెలర్లు, విద్యా సంస్థలు తదితరుల నుంచి అభిప్రాయాలను, సూచనలను కమిటీ కోరింది. జూన్‌ 27 నుంచి జులై 7 వరకు అందిన సలహాలు, సూచనల్లో అత్యధికం విద్యార్థుల నుంచే వచ్చినట్లు కమిటీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వానికి కమిటీ రెండు నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.


------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

Posted Date : 17-07-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం