‣ డిగ్రీ, పీజీతో దరఖాస్తుకు అవకాశం
నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లు, కార్యాలయాల్లో 74 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓంఎంఆర్ ఆధారిత ఆఫ్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
ప్రకటించిన ఖాళీల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్)-60, ఎఫ్ అండ్ ఏ-10, లా-04 పోస్టులు ఉన్నాయి.
‣ మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): రెండేళ్ల ఫుల్‌టైమ్ ఎంబీఏ/ పీజీడీబీఎం/ పీజీడీఎం మార్కెటింగ్/ అగ్రీ బిజినెస్ మార్కెటింగ్/ రూరల్ మేనేజ్‌మెంట్/ ఫారిన్‌ట్రేడ్/ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ 60 శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో పాసవ్వాలి.
‣ మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎఫ్ అండ్ ఏ): సీఏ/ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ పట్టా ఉండాలి.
‣ మేనేజ్‌మెంట్ ట్రైనీ (లా): మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్ డిగ్రీ/ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఫుల్‌టైమ్ ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50 శాతం సరిపోతుంది.
‣ ఎన్‌ఎఫ్‌ఎల్ ఉద్యోగులు కరస్పాండెన్స్/ పార్ట్‌టైమ్ డిగ్రీ/ డిప్లొమా 50 శాతం మార్కులతో పాసైనా సరిపోతుంది.
31.10.2023 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు.
ఎంపిక విధానం
ఆఫ్‌లైన్ ఓఎంఆర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఓఎంఆర్ ఆబ్జెక్టివ్ పరీక్షను ఏ తేదీన, ఎక్కడ నిర్వహించేదీ, పరీక్ష కేంద్రం వివరాలను అడ్మిట్‌కార్డ్ ద్వారా తెలియజేస్తారు. దీన్ని వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి, పోస్టులో పంపరు.
‣ తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం పరీక్షను హైదరాబాద్‌లో నిర్వహిస్తారు.
‣ ఓఎంఆర్ టెస్ట్‌లో ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటుంది. వ్యవధి 2 గంటలు. 150 ప్రశ్నలకు 150 మార్కులు. 100 ప్రశ్నలు విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి ఇస్తారు. జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్/ అవేర్‌నెస్‌కు సంబంధించిన 50 ప్రశ్నలు అడుగుతారు.
‣ నెగెటివ్ మార్కింగ్ లేదు.
పర్సనల్ ఇంటర్వ్యూ: ఓఎంఆర్ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. అభ్యర్థులను 1 : 5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. ఈ అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఈ సమాచారాన్ని అభ్యర్థికి ఎస్‌ఎంఎస్‌తోపాటు.. ఈమెయిల్ ఐడీకీ తెలియజేస్తారు.
‣ పర్సనల్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు సెకండ్ ఏసీ రైల్వే/ బస్ ఛార్జీలను చెల్లిస్తారు.
తుది ఎంపిక: ఓఎంఆర్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ఆధారంగా.. కేటగిరీలవారీగా అభ్యర్థుల తుది జాబితాను రూపొందిస్తారు. ఆఫ్‌లైన్ ఓఎంఆర్ బేస్ట్ టెస్ట్‌కు 80 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 20 శాతం మార్కులు కేటాయించారు. అభ్యర్థులు రెండిట్లోనూ 50 శాతం మార్కులు సాధించాలి.

సన్నద్ధత ఇలా
100 ప్రశ్నలు సబ్జెక్టు సంబంధిత అంశాల నుంచే వస్తాయి. కాబట్టి డిగ్రీలో చదివిన ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలి. సబ్జెక్టులపై పట్టు సాధించాలి.
‣ 50 ప్రశ్నలు జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్/ అవేర్‌నెస్ నుంచి వస్తాయి. బ్యాంక్ పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
‣ వివిధ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉండే మాక్ టెస్ట్‌లూ రాయొచ్చు. ఇవి రాయడం వల్ల పరీక్షపైన అవగాహన వస్తుంది. అసలు పరీక్ష సమయంలో ఒత్తిడికి గురికాకుండా ఉండగలుగుతారు.
‣ నిర్ణీత సమయంలోనే ప్రశ్నపత్రాన్ని పూర్తిచేయడానికి ప్రయత్నించాలి. ఈ పరీక్ష వ్యవధి రెండు గంటలు కాబట్టి ఆ సమయంలోనే పరీక్ష పూర్తయ్యేలా చూడాలి. సాధన చేయడం ద్వారా సమయ నిర్వహణపై పట్టు సాధించవచ్చు.
‣ నెగెటివ్ మార్కింగ్ లేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముందుగా తెలిసిన ప్రశ్నలకూ, తర్వాత కాస్త సమయం తీసుకుని తెలియని వాటికీ సమాధానాలు గుర్తించాలి. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి.
గమనించాల్సినవి: ఒకరు ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి.
‣ ప్రస్తుతం వినియోగిస్తోన్న ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లనే దరఖాస్తులో రాయాలి. వీటిని కనీసం ఏడాదిన్నపాటు మార్చకూడదు.
‣ దరఖాస్తు కాపీ, ఫీజు రసీదు, అడ్మిట్‌కార్డ్‌లను అభ్యర్థులు తమ వద్ద భద్రపరుచుకోవాలి.
‣ నియామకాలకు సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థులు తరచూ వెబ్‌సైట్‌ను చూస్తుండాలి.
‣ దరఖాస్తుకు చివరి తేదీ: 01.12.2023
‣ దరఖాస్తు సవరణ తేదీలు: 03, 04 డిసెంబరు 2023
‣ వెబ్‌సైట్: https://www.nationalfertilizers.com/
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆన్‌క్యాంపస్, ఆఫ్‌క్యాంపస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్
‣ స్తబ్ధత వీడితే కొలువు కొట్టొచ్చు!
‣ ఎయిమ్స్ భోపాల్‌లో నాన్‌ఫ్యాకల్టీ పోస్టులు