• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పవర్‌ గ్రిడ్‌లో కొలువు కావాలా?

800 ఖాళీల భర్తీకి ప్రకటన

న్యూదిల్లీలోని ‘మహారత్న’ ప్రభుత్వరంగ సంస్థ పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ నియామక ప్రకటన విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన 800 ఫీల్డ్‌ ఇంజినీర్, సూపర్‌వైజర్‌ పోస్టులను భర్తీ చేయబోతోంది.  డిప్లొమా/ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు ఇది సదవకాశం!  స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారిని కనీసం రెండేళ్ల కాలానికి లేదా ప్రాజెక్టులు పూర్తయ్యేవరకూ విధుల్లోకి తీసుకుంటారు. 


అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటించిన వాటిలో...  


ఫీల్డ్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌): 50 పోస్టులు. 


‣ ఫీల్డ్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌): 15 పోస్టులు.  


‣ ఫీల్డ్‌ ఇంజినీర్‌ - (ఐటీ):  15 పోస్టులు.   


ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ (ఎలక్ట్రికల్‌): 480 పోస్టులు .  


ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌): 240 పోస్టులు. 


దరఖాస్తు చేయదల్చుకున్న అభ్యర్థులకు 11.12.2022 నాటికి 29 సంవత్సరాలు ఉండాలి. 11.12.1993 - 11.12.2004 మధ్య జన్మించినవారు అర్హులు. రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు నిబంధనలకు అనుగుణంగా గరిష్ఠ వయసులో మినహాయింపులు వర్తిస్తాయి.


ఏయే అర్హతలు? 


ఫీల్డ్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టుకు.. ఎలక్ట్రికల్‌ విభాగంలో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) పాసై ఉండాలి. జనరల్‌/ఓబీసీ(ఎన్‌సీఎల్‌)/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిగ్రీ పాసవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు పాసైతే సరిపోతుంది. డిజైన్‌/ఇంజినీరింగ్‌/కన్‌స్ట్రక్షన్‌/టెస్టింగ్‌ అండ్‌ కమిషనింగ్‌/ ఓఅండ్‌ఎం ఇన్‌ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ (ఆర్‌ఈ)/ డిస్ట్రిబ్యూషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డీఎంఎస్‌), సబ్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఎస్‌టీ/ ట్రాన్స్‌మిషన్‌ లైన్స్‌ (టీఎల్‌ఎస్‌/ సబ్‌-స్టేషన్స్‌ (ఎస్‌/ఎస్‌)లో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. 


ఫీల్డ్‌ ఇంజినీర్‌ - ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ పోస్టుకు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) చేసిన అభ్యర్థులు అర్హులు. జనరల్‌/ఓబీసీ (ఎన్‌సీఎల్‌)/ఈడబ్ల్యూఎస్‌ అభ్యుర్థులు 55 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ పాసై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్థులు పాస్‌ మార్కులు సాధిస్తే సరిపోతుంది. డిజైన్‌/ ఇంజినీరింగ్‌ /కన్‌స్ట్రక్షన్‌/ టెస్టింగ్‌ అండ్‌ కమిషనింగ్‌/ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఆఫ్‌ టెలి కమ్యూనికేషన్‌ సిస్టమ్‌లో ఏడాదిపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. 


 ఫీల్డ్‌ ఇంజినీర్‌ (ఐటీ) పోస్టులకు.. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజినీరింగ్‌) 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు పాసైతే సరిపోతుంది. డి…జైన్‌/ ఇంజినీరింగ్‌/ కన్‌స్ట్రక్షన్‌/టెస్టింగ్‌ అండ్‌ కమిషనింగ్‌/ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఆఫ్‌ ఐటీ సిస్టమ్స్‌/ నెట్‌వర్కింగ్‌లో ఏడాదిపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. 


ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టుకు ఎలక్ట్రికల్‌ లేదా తత్సమాన విభాగంలో డిప్లొమా పాసై ఉండాలి. జనరల్‌ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు పాసైతే సరిపోతుంది. కన్‌స్ట్రక్షన్‌/టెస్టింగ్‌ అండ్‌ కమిషనింగ్‌/ ఓ అండ్‌ ఎం ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ వర్క్స్‌ ఇన్‌ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ (ఆర్‌ఈ)/ డిస్ట్రిబ్యూషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డీఎంఎస్‌)/ సబ్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఎస్‌టీ)/ ట్రాన్స్‌మిషన్‌ లైన్స్‌ (టీఎల్‌ఎస్‌)/ ట్రాన్స్‌మిషన్‌ సబ్‌-స్టేషన్స్‌ (ఎస్‌/ఎస్‌)లో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. బీటెక్‌/బీఈ/ఎంటెక్‌/ఎంఈ.. లాంటి ఉన్నత సాంకేతిక విద్యార్హతలున్న అభ్యర్థులు డిప్లొమా చేసినా చేయకపోయినా ఈ పోస్టుకు దరఖాస్తు చేయడానికి అనర్హులు. 


ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ - ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌కు పోస్టుకు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/తత్సమాన విభాగంలో డిప్లొమా పూర్తిచేసుకున్నవారు అర్హులు. జనరల్‌ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 55 శాతం మార్కులతో డిప్లొమా పాసై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు పాసైతే సరిపోతుంది. బీటెక్‌/బీఈ/ఎంటెక్‌/ఎంఈ లాంటి ఉన్నత సాంకేతిక విద్యార్హతలున్న అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేయడానికి అనర్హులు. 


అభ్యర్థులు ఎక్కువమంది ఉంటే..


   ఫీల్డ్‌ ఇంజినీర్‌ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అయితే అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే స్క్రీనింగ్‌ టెస్ట్‌ను నిర్వహించి, అందులో ప్రతిభ చూపిన వారిని మాత్రమే ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. స్క్రీనింగ్‌ టెస్ట్‌ కాలవ్యవధి గంట. దీంట్లో భాగంగా టెక్నికల్‌ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లు ఉంటాయి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌లో ఇంజినీరింగ్‌ సిలబస్‌ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో 25 ప్రశ్నలు ఉంటాయి. దీంట్లో లాజికల్‌ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, కాంప్రహెన్షన్, ఒకాబ్యులరీ, డేటా సఫిషియెన్సీ, నంబర్‌ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలుంటాయి. ఇవన్నీ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు (ఎంసీక్యూ). ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు. 


స్క్రీనింగ్‌ టెస్ట్‌లో అన్‌రిజర్వుడ్‌ అభ్యర్థులకు కనీసార్హత మార్కులు 40 శాతం. రిజర్వుడ్‌ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి. దీంట్లో అర్హత సాధించిన అభ్యర్థులతో తుది జాబితా తయారుచేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూలో అన్‌రిజర్వుడ్‌ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులు, రిజర్వుడ్‌ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి. స్కిల్‌టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూలకు అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లిష్‌ భాషను ఎంచుకోవచ్చు. 


దరఖాస్తు ఫీజు: ఫీల్డ్‌ ఇంజినీర్‌ పోస్టులకు రూ.400, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు రూ.300. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 


దరఖాస్తులకు చివరి తేదీ: 11.12.2022


వెబ్‌సైట్‌:  http://www.powergrid.in

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉన్నాయా మీకు ఈ ఉద్యోగ లక్షణాలు?

‣ డిజిటల్‌ అక్షరాస్యత... మీకుందా?

‣ క్లిష్ట స‌మ‌యాల్లోనూ ఉద్యోగ సాధ‌న ఎలా?

‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!

‣ డిగ్రీతో ఐఐటీలో ఉద్యోగాలు

Posted Date : 23-11-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌